Ram Pothineni| ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రం రూపొందుతుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుండగా, చిత్రంలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్నారు. దీంతో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా జూన్ 14న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కుతున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది.తాజాగా డబుల్ ఇస్మార్ట్ మూవీ నుండి రామ్ ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇందులో రామ్ స్టన్నింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక ఈ పోస్టర్ ద్వారా డబల్ ఇస్మార్ట్ టీజర్ ని రామ్ పోతినేని బర్త్‌డే మే 15న రిలీజ్ చేస్తామని కూడా అధికారికంగా ప్రకటించారు. దీంతో రామ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామ్ బర్త్ డే రోజు రానున్న టీజర్ ఎలాంటి కిక్ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ని మించి డబల్ ఇస్మార్ట్ ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
డబుల్ ఇస్మార్ట్ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా రామ్‌ని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. అలానే దర్శకుడు పూరీ జగన్నాథ్‌కి కూడా ఇస్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేదు. దీంతో ఈ ఇద్దరు కూడా డబుల్ ఇస్మార్ట్‌తో మంచి హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. ఇక డబుల్ ఇస్మార్ట్ తర్వాత ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ నెట్ ఫ్లిక్స్ తో రామ్ ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.. ఇప్పటికే రామ్ పోతినేనితో డీల్ కూడా కుదుర్చుకున్నారని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో అనౌన్స్‌మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందట.