Site icon vidhaatha

Sania Mirza| ఏంటి.. ఆ హీరో సినిమాలో సానియా మీర్జా ఐటెం సాంగ్ చేయ‌బోతుందా?

Sania Mirza| భార‌త టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.ప్రేమించి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌కి విడాకులు ఇచ్చింది. 15 ఏళ్ల పాటు సంతోషంగానే ఉన్న ఈ జంట ఊహించ‌ని విధంగా విడాకులు తీసుకున్నారు. ఇక సానియా నుండి విడిపోయిన త‌ర్వాత షోయబ్ మాలిక్ పాకిస్థాన్‌కు చెందిన హీరోయిన్ సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. సనా జావేద్‌తో షోయబ్ మాలిక్ ఎఫైర్ పెట్టుకున్న కార‌ణంగానే సానియా విడాకులు తీసుకుంద‌నే ప్ర‌చారం అయితే ఉంది. దీనిపై పూర్తి క్లారిటీ అయితే లేదు.సానియా మీర్జా కూడా మరో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ ఆ మ‌ధ్య నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. దీనిపై సానియా స్పందించింది లేదు.

ఇక సానియా మీర్జాకి సినిమా ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖుల‌తో మంచి రిలేష‌న్ ఉంది. ఫరా ఖాన్, కరణ్ జోహార్, పరిణీతి చోప్రా , సాజిద్ ఖాన్ సహా చాలా మంది తారల‌తో సానియా మంచి స్నేహం మెయింటైన్ చేస్తుంది. తాజాగా కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ సీజన్‌లో ఫరా, సానియా కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికర విషయాలను వెల్ల‌డించారు.ఈ షోలో కరణ్ సానియాపై ప్రశంసలు కురిపిస్తూ, ఆమె పూర్తిగా ఫిల్మీ అని కామెంట్ చేశాడు. దానికి సానియా నేను టెన్నిస్ క్రీడాకారిణి కాకపోతే సినిమా ఇండస్ట్రీలో పని చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.ఇక ప‌క్క‌నే ఉన్న ఫరా మాట్లాడుతూ సానియా ఇప్పటివరకు చాలా పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్స్ ఆఫర్‌లను సానియా తిరస్కరించిందని తెలిపింది.

ఫరా సోదరుడు తన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్‌ను కూడా తనకు ఆఫర్ చేశాడని, కాని దానిని కూడా తాను తిర‌స్క‌రించిన‌ట్టు సానియా పేర్కొంది. అప్పుడు ఎందుకు ఆ ఆఫ‌ర్‌ని రిజెక్ట్ చేశావు అని క‌రణ్ జోహార్.. సానియాని ప్ర‌శ్నించ‌గా, తనకు నటిగా లేదా గాయనిగా తెరపై కనిపించడానికి ఆసక్తి లేదు అని చెప్పుకొచ్చింది సానియా. ఇప్పుడు సానియా మీర్జా చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ఇక గుత్తా జ్వాల లాంటి ప్లేయర్స్ ఇప్పటికే సినిమాల్లో నటించారు. గుత్తా కూడా ఓసినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. ఇక సానియా సినిమాల్లోకి వస్తే.. ఆమె క్రేజ్ మ‌రింత పెర‌గ‌డం ఖాయం అంటున్నారు.

Exit mobile version