Farhan Akthar’s 120 Bahadur | విధాత : యుద్ధం..దేశభక్తి నేపథ్యంతో సాగే సినిమాలు ప్రేక్షకులను పోరాటాలు.. భావోద్వేగాలతో కూడిన వాస్తవిక యుద్ద క్షేత్రంలోకి తీసుకెలుతుంటాయి. అలాంటి యుద్దం కథతో బాలీవుడు నటుడు ఫర్హాన్ అక్తర్(Farhan Akthar) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘120 బహదూర్’. భారత్ చైనా మధ్య 1962లో జరిగిన యుద్దంలో 3వేల మంది చైనా సైనికులతో మేజర్ షైతాన్ సింగ్ భాటి నేతృత్వంలోని 200మంది భారత సైనికుల బృందం సాగించిన యుద్దం నేపథ్యంతో ‘120 బహదూర్’ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది. ఈ సినిమా టీజర్ ను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.
దర్శకుడు రజనీష్(రాజీ ఫేమ్) రూపొందిస్తున్న ఈ సినిమాలో పరమ వీర చక్ర పురస్కార గ్రహీత మేజర్ షైతాన్ సింగ్ భాటి పాత్రలో ఫర్హాన్ అక్తర్ నటిస్తుండగా…రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఈ పిరియాడిక్ వార్ మూవీ టీజర్ ఆనాటి భారత్ చైనా సరిహద్దుల్లోని యుద్ద భూమిలోని పోరాట దృశ్యాలు..భావోద్వేగ సన్నివేశాలు..డైలాగ్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా…దేశభక్తిని రగించేలా సాగాయి. నవంబర్ 21న విడుదల ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర బృందం వెల్లడించింది. భాగ్ మిల్కా భాగ్ తర్వాత ఫర్హాన్ అక్తర్ మరోసారి బయోపిక్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.