Dhochaave Nanne Song Released | ‘ప్రేమంటే’ మూవీ నుంచి సాంగ్ రిలీజ్

ప్రియదర్శి, ఆనంది నటిస్తున్న 'ప్రేమంటే' చిత్రం నుంచి 'దోచావే నన్నే నువ్విలా..' అనే మెలోడీ పాటను నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

Dhochaave Nanne Song from Premante Movie

విధాత : ప్రియదర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమంటే’ నుంచి మేకర్స్ సాంగ్ విడుదల చేశారు. నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ‘దోచావే నన్నే నువ్విలా..’ అనే పాటను విడుదల చేశారు. ‘రాయంచతో రాసలీల నడిరేయివేళ’ అంటూ సాగిన ఈ మెలోడీ పాటను అబ్బి పాడగా, శ్రీమణి లిరిక్స్‌ అందించారు. సంగీతం లియోన్‌ జేమ్స్‌ అందించారు.

ఈ సాంగ్‌ను నేచురల్ స్టార్ నాని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ.. ‘ఇది సింపుల్.. ఇది వేడిది.. ఇది ప్రేమ.. ప్రేమంటే నుండి దోచావే నన్నే సాంగ్ వచ్చేసింది.. ప్రియమైన దర్శి అండ్ బృందానికి శుభాకాంక్షలు’ అని తెలిపాడు. రానా దగ్గుబాటి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, స్పిరిట్‌ మీడియా పతాకాలపై జాన్వీ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌ రావు ఈ సినిమాను నిర్మించనున్నారు.