Site icon vidhaatha

Mazaka: మ‌జాకా నుంచి.. ‘ప‌గిలి’ పోయే పాట‌

విధాత‌: ధ‌మాకా వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత ద‌ర్శ‌కుడు త్రిన‌థ‌రావు న‌క్కిన (Thrinadha Rao Nakkina) రూపొందించిన చిత్రం మ‌జాకా (Mazaka). సందీప్ కిష‌న్ (Sundeep Kishn), రావు ర‌మేశ్ (Rao Ramesh), రీతూ వ‌ర్మ (Ritu Varma), అన్షు (Anshu) కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ నెలాఖ‌రున Feb 26thన ఈ సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో క‌లిసి హాస్య మూవీస్ నిర్మించ‌గా జీ స్టూడియో స‌మ‌ర్పిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌ల చేసిన‌ టీజ‌ర్‌, పాట‌లు మంచి రెస్పాన్స్ ద‌క్కించుకోగా తాజాగా బుధ‌వారం సినిమా నుంచి ప‌గిలి ప‌గిలి (Pagili) అంటూ సాగే మాస్ బీట్‌ లిరిక‌ల్ వీడియోను రిలీజ్ చేశారు. కాస‌ర్ల శ్యాం (Kasarla Shyam), ప్ర‌స‌న్న కుమాన్ బెజ‌వాడ‌లు ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా లియోన్ జేమ్స్ (Leon James) సంగీతం అందించారు. మ‌హాలింగం, సాహితి చాగంటి, ప్ర‌భ అల‌పించారు.

 

Exit mobile version