Site icon vidhaatha

మజాకా డైరెక్టర్‌ను లైన్‌లో పెట్టిన యంగ్ హీరో..?

విధాత‌: సినిమా చుపిస్తా మావ, నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే, ధమాకా, మరియు ఇటీవలి సూపర్ హిట్ మజాకా వంటి వరుస హిట్ చిత్రాలను అందించిన బ్లాక్ బస్టర్ దర్శకుడు త్రినాధ రావు నక్కిన (Trinadha Rao Nakkina) తన తదుపరి సినిమాను స్టార్ట్ చేసాడు. ఈసారి, అతను ఒక హై-ఎనర్జీ ఎంటర్టైనర్ కోసం ప్రామిసింగ్ యువ హీరో, కేఎల్ యూనివ‌ర్సిటీ వైస్ ప్రెసిడెంట్‌ హవీష్ కోనేరు (Havish)తో జతకట్టాడు.

కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలను డైరక్ట్ చేయడంలో త్రినాధ రావుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో యంగ్ హీరో హవీష్‌తో డబుల్ బ్లాక్ బస్టర్ సినిమా చేసేందుకు శ్రీకారం చుట్టాడు నక్కిన త్రినాథరావు. ఈ సినిమాను ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా సెట్స్ పైకి కూడా తీసుకు వెళ్లాడు. మంచి ముహూర్తం చూసుకుని అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేసే అవకాశం ఉంది.

ర‌విబాబు నువ్విలా, ఓంకార్‌ జీనియస్, బిగ్ బాస్ అభిజీత్‌తో కలిసి ‘రామ్ లీల’ , 2019లో 7 (సెవెన్‌) అనే సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హవీష్ కోనేరు తిరిగి ఆరేండ్ల త‌ర్వాత‌ త్రినాథరావు డైరెక్షన్‌లో చేయబోయే సినిమాతో తనను తాను కొత్తగా పరిచయం చేసుకోబోతున్నాడు. కాగా నువ్విలా సినిమాలో హావిష్ కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది.

ఈ నేపథ్యంలో రైటర్ బెజవాడ ప్రసన్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ కథ‌ను రెడీ చేసాడట. హవీష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి ఫార్మల్ షూట్ మెుదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారట.

Exit mobile version