విధాత, హైదరాబాద్ : లిఫ్ట్ లలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలతో తలెత్తుతున్న ప్రమాదాలు మనుషుల ప్రాణాలు బలిగొంటున్నాయి. తాజాగా ఓ లిఫ్ట్ ప్రమాదంలో ఓ వ్యక్తి వెంట్రుకవాసిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన వైరల్ గా మారింది.
గుజరాత్‌లోని వల్సద్‌లో హౌసింగ్ కాంప్లెక్స్‌లోని అపార్ట్మెంట్ లో వత్సల్బాయ్ పంచాల్ అనే వ్యక్తి లిఫ్ట్ ఎక్కి, తన ఫ్లోర్‌లో దిగే సమయంలో లిఫ్ట్ ఒక్కసారిగా పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ అప్పటికే ఆయకు ముందుకు అడుగేసేయడంతో ప్రమాదంలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయాన్ని తప్పించుకున్నాడు. ఒళ్ళు గగుర్పొడిచే ఈ ప్రమాద దృశ్యాలు సీసీ టీవీలో రికార్డ్ అవ్వగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తృటిలో లిఫ్ట్ ప్రమాదంలో ప్రాణ గండాన్ని తప్పించుకున్న పంచాల్ వీడియో చూసిన నెటిజన్లు.. ఒక్క క్షణం ఆలస్యమైనా ప్రాణాలు పోయేవని, భూమి మీద నూకలు ఉన్నాయి అంటే ఇదేనేమో! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఎంత ఘోరం జరిగింది 👽pic.twitter.com/DRpWA2jdCk
— పెండ్లి పురుషోత్తం రెడ్డి (@PPR_CHALLA) March 3, 2026
