• Telugu News
  • /National

బస్ కండక్టర్ లేచిపోయిన భార్య: ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఫిర్యాదు

నా భార్య నన్ను వదిలేసి రాత్రికి రాత్రే తను ప్రేమించిన స్థానిక బస్ కండక్టర్ తో లేచిపోయిందంటూ మలయాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యంలో పడేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అఖిల్ విడుదల చేయగా...అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Reported by: Y.V. Narsimha Reddy | జాతీయం | Aug 12, 2026, 11:02 am IST
Read Time: 5 mins
బస్ కండక్టర్ లేచిపోయిన భార్య: ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ ఫిర్యాదు

విధాత: ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా లైఫ్ స్టైల్ గూర్చి యూట్యూబ్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వారికి సోషల్ మీడియాలో లక్షలాదిమంది ఫాలోవర్స్..అభిమానులు ఉన్నారు. వారందరి దృష్టిలో వారిద్దరు ఆదర్శ జంటగా కీరించబడుతున్నారు. ఇంతలోనే ఏమైందో ఏమోగాని ఓ రాత్రి భర్తకు తెలియకుండా అతని భార్య తన ప్రియుడితో కలిసి ఇంటినుంచి ఉడాయించింది.

నా భార్య నన్ను వదిలేసి రాత్రికి రాత్రే తను ప్రేమించిన స్థానిక బస్ కండక్టర్ తో లేచిపోయిందంటూ మలయాళ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సోషల్ మీడియా ఫాలోవర్లను ఆశ్చర్యంలో పడేసింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను అఖిల్ విడుదల చేయగా…అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండేళ్ల క్రితం మేఘా అనే యువతిని అఖిల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కేరళంకు చెందిన అఖిల్, మేఘా క్రేజీ జంటకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లక్షలాది మంది ఫాలోవర్స్‌తో, వేలాది మంది అభిమానులు ఉండగా.. వీరు ఒక ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందారు. ఆదర్శ దంపతులుగా పేరు తెచ్చుకున్న అఖిల్-మేఘా బంధం ఇప్పుడు ముక్కలైంది. భర్తకు తెలియకుండా స్థానిక బస్సు కండక్టర్‌తో మేఘా ప్రేమాయణం నడిపింది. ఈ క్రమంలోనే తన భర్తను వదిలేసి ఓ రాత్రి ఇంటినుంచి వెళ్లిపోయి కండక్టర్‌తో పారిపోయిందని అఖిల్ పోలీస్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇంట్లో నుంచి వెళ్లిపోయే క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న నగదు, బంగారు ఆభరణాలను కూడా తీసుకువెళ్లిందని ఆఖిల్ ఆరోపిస్తున్నారు. ఈ పరిణామంతో తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు అఖిల్ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించినదిగా చెబుతున్న సీసీటీవీ ఫుటేజీని సోషల్ మీడియాలో అఖిల్ పోస్ట్ చేశారు. ఇదంతా చూసిన వారి ఫాలోవర్స్‌ దిగ్భ్రాంతికి గురవుతున్నారు. భార్యాభర్తలుగా కలిసి లైఫ్‌స్టైల్ కంటెంట్ చేసే ఈ జంటకు సంబంధించిన ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఎంతో అన్యోన్యంగా కనిపించే వీరి జీవితంలో ఇటువంటి ఘటన చోటుచేసుకోవడం వారి ఫాలోవర్లను విస్మయానికి గురిచేసింది.

అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు అఖిల్ చేసిన ఆరోపణలు మాత్రమే ప్రచారంలో కొనసాగుతుండగా…మేఘన వైపు నుంచి దీనిపై ఎటువంటి స్పందన రాలేదు. ఆమె వెల్లడించే వివరణతోనే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.