Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడూ..? : కేటీఆర్ నిలదీత

రైతు భరోసా చెల్లింపులపై కేటీఆర్ తీవ్ర విమర్శలు. డిసెంబర్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా రాలేదని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.

KTR

విధాత, హైదరాబాద్ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏడాదికి మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. నేడు ఏడాదికి కనీసం ఒక పంటకు కూడా రైతు బంధు ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు..మోసాలు ఇట్లానే ఉంటాయి అని విమర్శించారు. ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరుగుతుందని నమ్మబలికిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు రైతులను నట్టేటా ముంచుతున్నాడని దుయ్యబట్టారు.

మార్చి నాల్గవ తేదీ వచ్చినా, డిసెంబర్లో వేయాల్సిన రైతుబంధు డబ్బులు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి రైతులకు ఇయ్యలేదని గుర్తు చేశారు. ఈ రాబందు కాంగ్రెస్ రైతు బంధుకు మంగళం పాడుతుందని కేసీఆర్ ఎప్పుడో చెప్పారు అని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ మాటలు ఇప్పడు నిజమవుతున్నాయని, తెలంగాణ రైతాంగం మేల్కొని కాంగ్రెస్ మోసాన్ని గ్రహించాలని, నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

రైతు భరోసా జాప్యంపై బీఆర్ఎస్ ఫైర్

రైతు భరోసా జాప్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి ఉదృతం చేస్తుంది. డిసెంబర్ లో ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు జనవరి మొదటి వారంలో అని ఓసారి, సంక్రాంతికి ఇస్తామని మరోసారి లీక్ లు ఇచ్చి..చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఇస్తామని చెప్పి ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని మండిపడింది. రైతు భరోసా వస్తుందని అప్పలు చేసి యాసంగి పంటల సాగు చేసిన రైతులు రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చింది. కేబినెట్ భేటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకోకుండా కేవలం కాంట్రాక్టులు, కమిషన్ల పనులపై చర్చించి ఆమోదించుకున్నారని విమర్శించింది.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కేబినెట్ భేటీకి హాజరుకాకపోగా, ఆ తర్వతా కూడా… ఆయిల్ ఫామ్, డ్రోన్ స్ఫ్రే ల స్కీమ్ లపై ప్రకటనలు ఇచ్చాడని, కాని రైతు భరోసా మాత్రం మాట్లాడకపోవడం దారుణం అని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంది.

ఇవి కూడా చదవండి :

Gold Silver Price Today | దిగొచ్చిన బంగారం, వెండి ధరలు
Virsoh | విరోష్ జంట ప్ర‌త్యేక‌ విందు .. అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్న విజయ్–రష్మిక

Latest News