Virsoh | విరోష్ జంట ప్ర‌త్యేక‌ విందు .. అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్న విజయ్–రష్మిక

Virsoh | కొత్త దంపతులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మంగళవారం (మార్చి 3) రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో అభిమానుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు

  • By: sn |    movies |    Published on : Mar 04, 2026 9:30 AM IST
Virsoh | విరోష్ జంట ప్ర‌త్యేక‌ విందు .. అభిమానులతో కలిసి సంబరాలు జరుపుకున్న విజయ్–రష్మిక

Virsoh | కొత్త దంపతులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నాలు తమ పెళ్లి సందర్భంగా ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణాలను అందించారు. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఈ జంట, మంగళవారం (మార్చి 3) రాత్రి నగరంలోని ఓ ప్రముఖ హోటల్‌లో అభిమానుల కోసం ప్రత్యేక వెడ్డింగ్ రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్, రష్మిక స్వయంగా ఫ్యాన్స్‌కు వడ్డించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక్కో అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారితో ఆనందాన్ని పంచుకున్నారు.

లేడీ అభిమానిని రష్మిక హగ్ చేసుకోవడం, విరోష్ జంట‌ కలిసి వంటకాలు వడ్డించడం అక్కడి వాతావరణాన్ని మరింత హృద్యంగా మార్చింది. అభిమానులతో సెల్ఫీలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ ఆ వేడుకను మరింత ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. అనంతరం విజయ్, రష్మిక కూడా అభిమానులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా రష్మిక ప్రేమగా విజయ్‌కు తినిపించిన క్షణం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంప్రదాయ వేషధారణలో మెరిసిన జంట

ఈ విందు కార్యక్రమంలో ఇద్దరూ ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకున్నారు. రష్మిక చీరకట్టులో, మెడలో మంగళసూత్రం, నుదుటన సింధూరంతో ఎంతో అందంగా కనిపించారు. విజయ్ ఫ్లోరల్ డిజైన్ కుర్తాలో స్టైలిష్‌గా మెరిశారు. స్టార్ హోదాలో ఉన్నప్పటికీ, అభిమానులతో ఎంతో సరదాగా గడిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది.

ఇవాళ గ్రాండ్ రిసెప్షన్

వివాహానంతరం ఢిల్లీ వెళ్లిన ఈ జంట తమ వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీని , అలానే అమిత్ షాని కూడా ఆహ్వానించారు.. అనంతరం విజయ్ సొంత గ్రామంలో గృహప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుని అభిమానులకు ప్రత్యేక విందు ఇచ్చారు. ఇవాళ (మార్చి 4) హైదరాబాద్‌లో వీరి గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న ఈ వేడుకపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొత్తానికి, పెళ్లి వేడుకల్ని ఒక్కో ఘట్టంగా అభిమానులతో పంచుకుంటూ విజయ్–రష్మిక జంట తమ ప్రత్యేకతను మరోసారి నిరూపించింది.