Toxic | మార్చ్ 19 నుంచి జూన్ 2కి వాయిదా ప‌డ్డ ‘టాక్సిక్’.. యష్ అభిమానులకు షాక్, కార‌ణం ఏంటంటే..!

Toxic | కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ విడుదల విష‌యంలో ఊహించ‌ని షాక్ తగిలింది. కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మార్చ్ 19న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు.

Toxic | కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్ విడుదల విష‌యంలో ఊహించ‌ని షాక్ తగిలింది. కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను మార్చ్ 19న గ్రాండ్ రిలీజ్ చేయాలని మేకర్స్ ముందుగా ప్రకటించారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమవడంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.

అయితే తాజాగా విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ ద్వారా చిత్ర బృందం షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. మార్చ్ 19 విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇటీవల మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అక్కడి మార్కెట్‌పై ఉండే ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారీ విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు ఆ ప్రాంతం కీలకమైన మార్కెట్ కావడంతో, పూర్తి స్థాయి రిలీజ్ వాతావరణం నెలకొనే వరకు వేచి చూడాలని నిర్మాతలు భావించినట్లు సమాచారం.

ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో ఈ అంశంపై చర్చలు సాగుతుండగా, చివరకు అదే కారణంతో సినిమా వాయిదా పడటం అధికారికంగా ఖరారైంది. కొత్త విడుదల తేదీగా జూన్ 2ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ అప్‌డేట్ ఇవ్వడంతో యష్ అభిమానులు ఒకవైపు నిరాశ వ్యక్తం చేస్తూనే, మరోవైపు భారీ స్థాయిలో విడుదల కోసం మరికొంత సమయం వేచి చూడాల్సి వస్తుందని భావిస్తున్నారు. ‘టాక్సిక్’ చిత్రాన్ని హై టెక్నికల్ వాల్యూస్, అంతర్జాతీయ స్థాయి మేకింగ్‌తో రూపొందించినట్లు ఇప్పటికే టీజర్, పోస్టర్ల ద్వారా స్పష్టమైంది. యష్ లుక్, స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్, డార్క్ థీమ్ సినిమాపై అంచనాలను పెంచాయి.

ఇప్పుడు కొత్త తేదీ జూన్ 2గా ఫిక్స్ కావడంతో, సమ్మర్ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. మొత్తానికి, ‘టాక్సిక్’ కోసం అభిమానులు మరికొంత కాలం ఎదురు చూడక తప్పదనే పరిస్థితి ఏర్పడింది.

Latest News