విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. రూ.3,110తగ్గి రూ.1,64,510కి దిగి వచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,850తగ్గి రూ.1,50,800వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.20,000తగ్గి రూ.2,95,000వద్ద కొనసాగుతుంది.
యుద్దంతో బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటున్న నిపుణులు
అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్ పై కొనసాగిస్తున్న యుద్దంతో పశ్చిమాసియాలో నెలకొన్న సైనిక ఘర్షణల ఫలితంగా బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్దం మరికొన్ని వారాల పాటు కొనసాగనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో యుద్దం కొనసాగినన్ని రోజులు పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పసిడి, వెండి వంటి విలువైన లోహాలపై మళ్లీంచనున్నందునా… రానున్న రోజుల్లో బంగారం ధరలు భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరికొన్ని వారాలు కొనసాగిన పక్షంలో బంగారం ఔన్స్ 6వేల డాలర్లకు చేరవచ్చని, త్వరలోనే తులం బంగారం ధర రూ. 2లక్షలు దాటి రూ.3లక్షల మరా్ు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మార్కెట్ నిపుణులు క్రిస్ వుడ్ అంచనాల మేరకు యుద్దం, ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక ఉద్రికత్తలు, కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, వడ్డీ రేట్లపై అనిశ్చితి, చమురు మార్కెట్ల సంక్షోభం, స్టాక్ మార్కెట్ల పతనం, కమోడిటీలు, డాలర్ పై బలహీన పడుతున్న నమ్మకంతో ప్రత్యామ్నాయ సురక్షిత పెట్టుబడులవైపు ఆసక్తి పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ లో ఔన్స్ బంగారం ధర 6వేల డాలర్ల మార్కును అధిగమించి 10వేల డాలర్ల వరకు కూడా వెళ్లవచ్చని అంచనా వేశారు. అదే నిజమైతే రానున్న ఐదు నుంచి ఆరేళ్లలో బంగారం ధర తులం రూ.3లక్షల మార్కును చేరవచ్చంటున్నారు.
