తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత భారతీ రాజా (Bharathiraja) కుమారుడు నటుడు మనోజ్ భారతీ రాజా (Manoj Bharathiraja) కొద్ది సేపటి క్రిత్రం చెన్నైలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారతీ రాజాకు జనని అనే కూతురు ఉంది. మనోజ్‌కు ఇద్దరు సంతానం.