‘క’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (Kiran Abbavaraam) నటిస్తోన్న నూతన చిత్రం దిల్ రూబా (Dilruba). రుక్సర్ థిల్లాన్ (Rukshar Dhillon) కథానాయిక. సామ్ సీఎస్ (Sam CS) సంగీతం అందించగా, విశ్వ కరుణ్ (Viswa Karun ) దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ఓ పాట సినిమాపై మంచి బజ్ తీసుకురాగా తాజాగా కన్నీ నీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. భాస్కరబట్లతో కలిసి డైరెక్టర్ విశ్వ కరుణ్ సాహిత్యం అందించగా సత్య ప్రకాశ్, మాళవిక సుందర్ ఆలపించారు.