విధాత : పశ్చిమాసియాలో నెలకొన్న సైనిక ఘర్షణలు మరణ మృందంగం వినిపిస్తున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా ఉమ్మడి దాడులు..ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన, అమెరికా దళాలపైన ప్రతిదాడులతో తీవ్ర, ఆస్తి ప్రాణ నష్టాలను నమోదు చేస్తున్నాయి. పశ్చిమాసియా దేశాలు ఇజ్రాయెల్, అమెరికా కూటమిగా, ఇరాన్ కూటమిగా మారిపోయి పరస్పరం దాడులకు దిగుతుండటంతో పౌరులు, విద్యార్ధులు అనేక మంది మృత్యువాత పడుతున్నారు.
ఇరాన్ పై శనివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 24మంది స్కూల్ విద్యార్ధులు మరణించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. మినాబ్ లోని స్కూల్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో 24 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు.
అమెరికా రక్షణశాఖ కార్యాలయం ‘పెంటగాన్’ ఇరాన్ పై చేపట్టిన తమ సైనిక చర్యను ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ గా పేర్కొంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులను ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’గా ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది.
ఇరాన్ ప్రతిదాడులు
ఇరాన్ సైతం ప్రతిదాడులు కొనసాగిస్తుంది. ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్ పై ఇరాన్ మిస్సెళ్లతో విరుచుకపడింది. అటు తమ దేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్‌పై క్షిపణి దాడి జరిగినట్లు బహ్రెయిన్ తెలిపింది. యూఏఈ, కువైట్, ఖతర్‌లలోనూ పేలుళ్లు వినిపించినట్లు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. యూఏఈలో ఒకరు మృతి చెందారు. యూఏఈలోని అబుదాబిలో పేలుళ్లు సంభవించాయి. అబుదాబిలోని యూఎస్ ఎయిర్ బేస్‌లే లక్ష్యంగా ఇరాన్ ఈ క్షిపణి దాడులు చేసినట్లు తెలుస్తోంది. యూఏఈ, ఖతర్ తదితర దేశాలు ఇప్పటికే తమ గగనతలాన్ని మూసివేశాయి. యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు ఇరాన్ వ్యతిరేక దేశాల నౌకలపై దాడులను ప్రకటించారు.
ఇరాన్‌ను నాశనం చేస్తాం: ట్రంప్
తాము ఎన్ని హెచ్చరికలు చేసినా ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి.. క్షిపణులను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని అందుకే ఆ దేశానికి వ్యతిరేకంగా భారీ సైనిక చర్య చేపట్టామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇక ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలను కలిగిఉండకుండా వాటిని పూర్తిగా నాశనం చేస్తున్నామన్నారు. ఆ దేశ నాయకులు ఇప్పటికైనా తమ మాట వినకపోతే మొత్తం దేశాన్ని నాశనం చేస్తామని హెచ్చరించారు. ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారని ట్రంప్ ఆరోపించారు. ఇటీవల నిరసనలు చేపట్టిన తన సొంత పౌరులనే అక్కడి ప్రభుత్వం వీధుల్లో దారుణంగా చంపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండడం ప్రమాదకరమని.. అందువల్లే వాటిని నాశనం చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
Ranji Trophy | తొలిసారిగా రంజీ ట్రోపీ విజేతగా జమ్మూ కశ్మీర్ చారిత్రాక విజయం
Fireworks Explosion : వేట్లపాలెంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18మంది మృతి !
