Fireworks Explosion : వేట్లపాలెంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18మంది మృతి !

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు. ఘటనలో 18మంది మృతి, పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Kakinada fireworks explosion

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారీ శబ్ధాలతో జరిగిన పేలుళ్ల ఘటనలో ఇప్పటికే 18మంది చనిపోయినట్లుగా సమాచారం. ప్రమాద ప్రాంతంలో మృతదేహాల భాగాలు చెల్లచెదురుగా పడి బీభత్సంగా కనిపించాయి. పేలుడు తీవ్రతతో చెలరేగిన మంటలను అర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 20మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని, గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన 8 మందిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించినట్లుగా తెలిపారు. పేలుడు శబ్దాలు సుమారు 5 కిలోమీటర్ల మేర వినిపించాయని స్థానికులు తెలిపారు. శబ్దం తీవ్రతకు పక్క గ్రామంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో స్లాబ్‌కు పగుళ్లు వచ్చాయి. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం.

పొలాల మధ్య ఏర్పాటు చేసిన సూర్యశ్రీ క్రాకర్స్ ట్రెండింట్ బాణసంచా తయారీ కేంద్రానికి సరైన అనుమతులు కూడా లేనట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు ఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని హోంశాఖ మంత్రి అనితను ఆదేశించారు. క్షతగాత్రులకు సరైన వైద్య సహాయం అందించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి :

శారదా పీఠం భూములపై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ !
టీనేజర్లలో ఇన్‌స్టాగ్రామ్ ‘వ్యసనం’? మెటా రహస్య నివేదికల్లో సంచలన విషయాలు: కోర్టులో విచారణ

Latest News