• Telugu News
  • /National

Kuno National Park | కూనో పార్కులోకి మరో తొమ్మిది చీతాలు!

బోట్స్వానా నుంచి తెచ్చిన 9 చీతాలను కునో నేషనల్ పార్క్‌లో విడుదల చేశారు. ప్రాజెక్ట్ చీతా కింద భారతదేశంలో చీతాల సంఖ్య 48కు చేరింది.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 28, 2026, 3:08 pm IST
Read Time: 3 mins
Kuno National Park | కూనో పార్కులోకి మరో తొమ్మిది చీతాలు!

విధాత : భారత్ లో అంతరించిపోయిన చీతా జాతి చిరుత పులులను తిరిగి పునరుద్దిరించే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టు చీతాలో భాగంగా బోట్స్వానా నుండి తెచ్చిన తొమ్మిది చిరుతలను కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ శనివారం మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్‌లోకి విడుదల చేశారు.

బోట్స్వానా నుండి తొమ్మిది చిరుత(ఆరు ఆడ చిరుతలు, మూడు మగ చిరుతలు)లను కునో నేషనల్ పార్క్ (KNP)కి తీసుకువచ్చారు. వీటి రాకతో భారతదేశంలోని మొత్తం పెద్ద చీతాల సంఖ్య 48కి చేరుకుంది. నాలుగు సంవత్సరాల జనాభా పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా ఆఫ్రికా నుండి మూడవ బ్యాచ్ చీతాలను ఐఏఎఫ్ విమానంలో తీసుకవచ్చారు. ప్రత్యేక ఏర్పాట్లు మధ్య వాటిని కూనో పార్కులోకి విడుదల చేశారు.

ప్రాజెక్టు చీతాను 2022 ప్రారంభించినప్పటి నుండి ఇప్పటిదాకా చీతాల జనాభా 48కి పెరిగింది. 2022లో నమీబియా నుంచి 8, 2023లో దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను దిగుమతి చేసుకోగా వాటికి 39 పిల్లలు జన్మించాయి. వాటిలో 27 అడవిలోని సంఘర్షణలు, ఆరోగ్య సమస్యల వంటి సవాళ్లను అధిగమించి జీవిస్తున్నాయి. 1947 నుండి భారతదేశంలో అంతరించిపోయిన ఆసియా చీతాలను ఆఫ్రికన్ సర్రోగేట్‌ చీతాలను ఉపయోగించి పునరుద్ధరించడం ప్రాజెక్ట్ చీతా లక్ష్యంగా కొనసాగుతుంది. ఇటీవల కునో పార్కుల పెరిగిన చీతాల మధ్య రద్దీని తగ్గించడానికి మూడు చీతాలను గాంధీ సాగర్ అభయారణ్యంలోకి తరలించడం జరిగింది.

ఇవి కూడా చదవండి :

అరగంట చాలు..ఎముకలు విరక్కుండా కొట్టగలను: రఘురామరాజు
టీనేజర్లలో ఇన్‌స్టాగ్రామ్ ‘వ్యసనం’? మెటా రహస్య నివేదికల్లో సంచలన విషయాలు: కోర్టులో విచారణ