అరగంట చాలు..ఎముకలు విరక్కుండా కొట్టగలను: రఘురామరాజు
ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఘాటుగా స్పందించారు. కస్టోడియల్ టార్చర్ కేసులో హెచ్చరికలు జారీ చేశారు.
అమరావతి : కస్టోడియల్ విచారణ పేరుతో నాపై సాగించిన హింసను నేను క్రీడామైదానంలో పడిపోయిన ఘటనతో ముడిపెట్టి సర్వీస్ కాల సస్పెన్షన్ ఎదుర్కొంటున్న దళిత క్రిస్టియన్, ఐపీఎస్ సునీల్ కుమార్ వ్యంగ్యంతో కూడిన వ్యాఖ్యలతో ట్వీట్ చేయడం బరితెగింపుగా ఉందని ఏపీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణరాజు ఘాటుగా స్పందించారు.
సర్వీస్ కాల సస్పెన్షన్ లో ఉన్న దళిత క్రిస్టియన్ సునీల్ కుమార్ ఐపీఎస్ ఒప్పుకుంటే అరగంట నాకు సరిపోతుంది అని, కేవలం అరగంట సమయంలో నన్ను కొట్టిన విధంగా ఎముకలువిరక్కుండా ఖచ్చితంగా కాళ్ళు కట్టేసి పాదాలపై కర్రతో పాటు రబ్బర్ బెల్ట్ తో కొట్టగలను అని రఘురామ కృష్ణరాజు ఓ లేఖలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అదే అరగంటలో.. నీ అందమైన నల్లని అరికాళ్ళు కూడా మరింత నల్లగా కమిలిపోయి రక్తపు చారల మచ్చలు పడేలా కొట్టగలను అని సునీల్ కుమార్ కు స్పష్టం చేశారు. సునీల్ కుమార్ వచ్చి కొట్టించుకుని నిరూపించుకుంటాను అంటే.. శాసన సభ్యుల క్రీడలు జరిగిన మైదానంలోనే, పబ్లిక్ లో ఈ కార్యక్రమం పెడతాను అన్నారు. అప్పుడు డాక్టర్ ప్రభావతి వైద్య పరీక్షలు నిర్వహించి ఏమని రిపోర్ట్ ఇస్తుందో చూద్దాం అని పేర్కొన్నారు. నిరూపణ అంటే హింస కాదు. నిరూపణ అంటే నిజం. ప్రభుత్వం తన సర్వీస్ కాలం మొత్తం సస్పెషన్ లో ఉంచిన ఉత్తర్వుల్లోని సంచలన అంశాల దెబ్బకు మతి భ్రమించి సునీల్ కుమార్ చేస్తున్న ఉడుత ఊపుల వ్యాఖ్యలు కట్టిపెట్టు అని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఇస్తామని చెప్పి.. బాధితులు కానివాళ్ల అకౌంట్లలో డబ్బులు వేసి ‘రిఫండ్ స్కీం రివర్స్ క్యాష్‌బ్యాక్’ అంశంతో పాటు ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి 75 లక్షలు దారి మళ్లించడం అంశంపై ప్రభుత్వం సస్పెషన్స్ ఉత్తర్వుల్లో పేర్కొన అంశాలు చూసి సునీల్ కుమార్ లో కంగారు ఎక్కువైయ్యిందని రఘు రామ కృష్ణరాజు తెలిపారు. గతంలో సునీల్ పోస్ట్ చేసిన ట్వీట్ కూడా చార్జ్ మెమో అయ్యిన సంగతి మరచిపోయినట్టున్నాడు అని, చివరికి రిటైర్ అయ్యేవరకు సస్పెన్షన్ పొడిగింపు ఉత్తర్వులు అందాయంటే అర్ధం రిటైర్ అయ్యాక కూడా కేసులు ఉంటాయి, కానీ ఉద్యోగం మాత్రం ఉండదు అని తన లేఖలో హెచ్చరించారు.
నాడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ అయిన నాపై కస్టోడియల్ టార్చర్‌కు పాల్పడ్డ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు అధికార మదం ఇంకా తలకెక్కే ఉందని, చట్టం తనకు వర్తించదన్న భ్రమలోనే ఉన్నాడని స్పష్టంగా అతని వ్యాఖ్యలు చెబుతున్నాయి అని రఘు రామ కృష్ణరాజు మండిపడ్డారు. ఇవి కేవలం వ్యంగ్యం మాత్రమే కాదు అని, ఇది న్యాయవ్యవస్థను సూటిగా అవమానించడమే అని, ఇది కస్టోడియల్ హింసను సమర్థించే వికృత మనస్తత్వానికి బహిరంగ ప్రదర్శన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి ఈ దారుణంపై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ప్రభుత్వం నిందితుడిని సస్పెండ్ చేసింది అని,
విచారణ న్యాయస్థాన పరిధిలో కొనసాగుతోంది అని, అలాంటి పరిస్థితుల్లో ఒక నిందితుడు మీడియా ముందుకు వచ్చి “నిజంగా కొట్టి ఉంటే ఎన్ని ఎముకలు విరిగేవి?” అంటూ మాట్లాడటం ఇది ధైర్యం కాదు, దురహంకారం అని విమర్శించారు. ఇది నిర్దోషిత్వం కాదు, నిర్లజ్జగా బరితెగింపుగా భావించాలి అని, శాసనసభ్యుల క్రీడా కార్యక్రమంలో క్రికెట్ ఆడుతూ నాకు జరిగిన మణికట్టు ఫ్రాక్చర్‌ను ఆయుధంగా మార్చుకుని, తనపై ఉన్న కస్టోడియల్ టార్చర్ ఆరోపణలను తేలికపరచాలని ప్రయత్నించడం అంటే బాధితుడిని మళ్లీ మళ్లీ బహిరంగంగా హింసించడం క్రిందకు వస్తుంది అని రఘు రామ కృష్ణరాజు వ్యాఖ్యానించారు.
మా నాయకుడు ఎన్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతుండగా, నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నాను. సునీల్ నాయక్, సునీల్ కుమార్ పై క్రిమినల్ కేసు రాజకీయ ప్రతీకారం కాదు.. నాటి జగన్ ప్రభుత్య అధికార దుర్వినియోగంపై న్యాయపోరాటం. కస్టోడియల్ టార్చర్ అనేది ఏ పార్టీకి చెందిన విషయం కాదు. ఏ వ్యక్తికి సంబంధించిన విషయం కాదు. సునీళ్ళ నేరం ప్రజాస్వామ్య వ్యవస్థను గాయపరిచిన నేరం. సునీల్ కుమార్ కు నేను స్పష్టంగా చెబుతున్నాను వ్యంగ్య వ్యాఖ్యలతో నిజాన్ని మార్చలేరు. అహంకారంతో న్యాయాన్ని ఓడించలేరు కులం ముసుగులో చట్టం నుంచి తప్పించుకోలేరు. న్యాయవ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. నిజం గెలుస్తుంది. రాజకీయ ఉడత ఊపులకు కాలం చెల్లింది. కస్టోడియల్ హింసకు పాల్పడిన సునీల్ అరెస్ట్ తధ్యం అని తన లేఖలో రఘురామ కృష్ణరాజు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ
Israel, USA Strikes Iran : ఇరాన్ పై విరుచుకపడిన ఇజ్రాయెల్, అమెరికా
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram