టీనేజర్లలో ఇన్‌స్టాగ్రామ్ ‘వ్యసనం’? మెటా రహస్య నివేదికల్లో సంచలన విషయాలు: కోర్టులో విచారణ

ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందా? లాస్‌ఏంజెల్స్‌లో మార్క్ జుకర్‌బర్గ్ విచారణ సందర్భంగా మెటా రహస్య అంతర్గత పరిశోధనాపత్రాల వెల్లడి. వ్యసన ఆరోపణలు, FOMO, కుంగుబాటు సమస్యలపై కోర్టు విచారణ. టీనేజర్ల తల్లిదండ్రులకు జాగ్రత్తలు

టీనేజర్లలో ఇన్‌స్టాగ్రామ్ ‘వ్యసనం’? మెటా రహస్య నివేదికల్లో సంచలన విషయాలు: కోర్టులో విచారణ టీనేజర్లకు ఇన్‌స్టాగ్రామ్ 'ప్రమాదం'నా? మెటా సీఈఓ జుకర్‌బర్గ్ కోర్టులో సాక్ష్యమిచ్చిన సంచలన విషయాలు.. మీ పిల్లలను కాపాడుకోండి!

Meta Knew Instagram Was Addictive for Teens – Court Documents Reveal Damning Truth

ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్లకు హానికరమా?

లాస్‌ఏంజెల్స్ ట్రయల్‌లో మెటా అంతర్గత డాక్యుమెంట్లు సంచలనంగా మారాయి. టీనేజర్లలో అడిక్షన్, డిప్రెషన్ సమస్యలు ఉన్నాయని తెలిసి కూడా ఎంగేజ్‌మెంట్ ఫీచర్లు కొనసాగించిందా? అనే ప్రశ్నలపై కోర్టు విచారణ సాగుతోంది.

  • టీన్ బ్రెయిన్‌పై ప్రత్యేక అధ్యయనాలు
  • ఇన్‌ఫినిట్ స్క్రోల్, ఆటోప్లే రూపకల్పనపై ఆరోపణలు
  • “బిగ్ టెక్ టోబాకో మూమెంట్” చర్చ

(విధాత ప్రత్యేకం)

మార్క్​ జుకర్​బర్గ్​ నేతృత్వంలోని మెటా కంపెనీకి చెందిన ఇన్​స్టాగ్రామ్​ ఇప్పుడు అమెరికాలో చారిత్రాత్మక న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. లాస్​ ఏంజిలస్​ సుపీరియర్ కోర్టులో కొనసాగుతున్న ఈ సంచలన విచారణ బిగ్ టెక్ కంపెనీలకు కీలకంగా మారే అవకాశముంది.

ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్ల మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని, అది వ్యసనంగా మారుతుందని మెటా కంపెనీకి ముందే తెలుసని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు ఆధారంగా మెటా అంతర్గత పరిశోధనా నివేదికలు, ఈమెయిళ్లు, ప్రెజెంటేషన్లు న్యాయస్థానానికి సమర్పించారు. అయితే మెటా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, తమ పరిశోధనలు వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికేనని వాదిస్తోంది.

ఈ విషయమై ది హైవైర్​ వెబ్​సైట్​ విస్తృతమైన కథనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం, ది ఆంక్షియస్​ జనరేషన్​ వెబ్​సైట్​ తన టెక్​ అండ్​ సొసైటీ ల్యాబ్​ ఎట్​ ఎన్​వైయూ స్టెర్న్​ శీర్షికలో వివిధ ప్రజావేగుల ద్వారా లీకైన మెటా అంతర్గత రహస్య పరిశోధనా నివేదికలను సంపాదించి, వాటిని క్రోడికరించి ప్రచురించింది.

టీనేజర్లపై ప్రభావం: వ్యసనం, FOMO, మానసిక ఒత్తిడి

Symbolic illustration of a cracked, shattered human head with a glowing purple Instagram icon inside, fragmented by dark cracks; overwhelmed by colorful hearts, likes, and notifications bursting around it, representing mental health breakdown from social media addiction.

ఇన్‌స్టాగ్రామ్ లైక్స్.. హార్ట్స్.. నోటిఫికేషన్స్ మధ్య మానసిక ఆరోగ్యం బద్దలు! టీనేజర్లపై ప్రభావం భయంకరం.. మెటా ట్రయల్ హెచ్చరిక!

కోర్టులో సమర్పించిన అంతర్గత నివేదికల ప్రకారం, చాలామంది టీనేజ్ వినియోగదారులు ఇన్‌స్టాగ్రామ్‌ను వదలలేకపోతున్నారని స్వయంగా పేర్కొన్నట్లు రికార్డులు సూచిస్తున్నాయి. “మంచైనా, చెడైనా వాడటం మాత్రం వదులుకోలేం. మేము నిస్సహాయస్థితిలో ఉన్నామ”నే అభిప్రాయాలు నమోదయ్యాయని పిటిషనర్లు చెబుతున్నారు.

FOMO – Fear Of Missing Out(ఆన్​లైన్​ స్నేహితులకు దూరమౌతామేమోననే భయం) కారణంగా యాప్(ఇన్‌స్టాగ్రామ్‌) వినియోగాన్ని తగ్గించుకోలేకపోతున్నారని కూడా అంతర్గత నివేదికలు వెల్లడిస్తున్నాయని ఆరోపణ. 2019లో తయారైన ఒక నివేదికలో “అడిక్టివ్ నరేటివ్(Addictive Narrative)” అనే పదం ఉపయోగించినట్లు కోర్టులో ప్రస్తావన వచ్చింది. అంటే, వదలలేని విధంగా చెప్పడం, వ్యసనకారక కథనం అనుకోవచ్చు.

ఒక 20 ఏళ్ల అమ్మాయి​ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ఈ కేసును భావోద్వేగభరితంగా మార్చింది. చిన్న వయసులోనే సోషల్ మీడియా వాడకం ప్రారంభమై, తర్వాత కుంగుబాటు, శరీరాకృతి గురించి ఆందోళన, ఆత్మహత్య ఆలోచనాధోరణి లాంటివి ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపింది. “ఫోన్ లేకుండా ఉండలేను” అని ఆమె కోర్టులో దీనంగా చెప్పినప్పుడు అందరూ చలించిపోయారని సమాచారం.

అయితే మెటా వాదన ప్రకారం, సోషల్ మీడియా వాడకం మరియు మానసిక సమస్యల మధ్య నేరుగా సంబంధం నిరూపించబడలేదని పేర్కొంటోంది. అనేక సానుకూల అనుభవాలు కూడా వినియోగదారులకు లభిస్తున్నాయని కంపెనీ చెబుతోంది.

 

టీనేజర్ల మెదడుపై అంతర్గత అధ్యయనాలు… ఫీచర్ల రూపకల్పనపై ఆరోపణలు

A smartphone displaying the Instagram app icon crossed out with a red prohibition symbol, held in a hand against a green background; Instagram feed elements peel away like a torn strip revealing a sunflower, symbolizing hidden harm or addiction risks for teens.

ఇన్‌స్టాగ్రామ్ యాప్‌పై ‘నో’ సంకేతం.. టీనేజర్ల మానసిక ఆరోగ్యానికి ముప్పు! మెటా ట్రయల్ బయటపెట్టిన దాచిన నిజాలు.. జాగ్రత్త!

2020లో రూపొందించిన “టీన్ ఫండమెంటల్స్” అనే అంతర్గత స్లైడ్‌షోలో కౌమార దశలో మెదడు అభివృద్ధి, రివార్డ్ సిస్టమ్, భావోద్వేగాల ప్రభావం వంటి అంశాలు చర్చించినట్లు కోర్టులో వెల్లడించారు. కౌమారదశలో మెదడు పూర్తిగా పరిపక్వం చెందకపోవడం, భావోద్వేగాలు మరియు ఆనందోద్రేకాలకు అతిగా స్పందించడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయని వాదిస్తున్నారు.

“ఇన్‌సేటియబుల్ అపిటైట్ ఫర్ నావెల్టీ(Insatiable Appetite for Novelty)” వంటి పదాలు ఉపయోగించి, అంటే ‘కొత్తదనంపై అంతులేని ఆపేక్ష’ 13 నుండి 19ఏళ్ల మధ్య వయసు పిల్లలను బలంగా ఆకర్షిస్తుందని రికార్డులు సూచించాయని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ అవగాహన ఆధారంగానే ఇన్‌ఫినిట్ స్క్రోల్, ఆటోప్లే, వేగంగా మారే కంటెంట్ డిస్కవరీ ఫీచర్లు రూపొందించారని ఆరోపిస్తున్నారు. 2017లోనే టీనేజర్లను ‘అత్యధిక ప్రాధాన్యతావర్గం’గా పేర్కొన్న ఈమెయిళ్లు, 2018లో “టీనేజర్లను బలంగా ఆకర్షిస్తే దీర్ఘకాలం మనతోనే ఉంటారు” అనే వ్యాఖ్యలతో ఉన్న పత్రాలు కూడా విచారణలో ప్రస్తావనకు వచ్చాయి.

మెటా మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ, యాప్ వినియోగాన్ని సౌకర్యవంతం చేయడమే లక్ష్యమని చెబుతోంది. టీనేజర్ల అకౌంట్లకు డిఫాల్ట్ ప్రైవసీ సెట్టింగ్స్, పేరెంటల్ కంట్రోల్ టూల్స్, సున్నిత కంటెంట్ నియంత్రణలు ఇప్పటికే అమలు చేశామని తెలిపింది.

నిజానికి మెటాపై ఈ ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. పిల్లల్లో సోషల్​మీడియా వాడకం ఒక వ్యసనంలా మారిందని సామాజిక శాస్త్రవేత్తలు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూనేఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని దేశాలు 16ఏళ్ల లోపు పిల్లలకు సోషల్​మీడియా వాడకం నిషేధించాయి. ముఖ్యంగా ఇన్స్​టాగ్రామ్​కు విపరీతమైన ఆదరణ ఉండటం, అది కూడా టీనేజర్లే ఎక్కువగా ఉండటం చాలా సాంకేతిక, మానసిక విశ్లేషణా సంస్థలు గమనించాయి. ఈ సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్​ వల్ల, జుకర్​బర్గ్​ వాదించినట్లు ఎటువంటి ప్రయోజనాలు లేకపోగా, పిల్లలు తమ కుటుంబానికి, స్నేహితులకు, సమాజానికి క్రమంగా దూరమవుతున్నారని పిటిషనర్లు వాదించారు.

ఇదొక ‘బిగ్ టెక్ టోబాకో మూమెంట్’..

Meta CEO Mark Zuckerberg walking outside Los Angeles Superior Court during the 2026 social media addiction trial, wearing a dark suit and escorted by security and lawyers; serious expression amid media presence, related to Instagram's impact on teen mental health.

లాస్ ఏంజెల్స్ కోర్టు వద్ద మార్క్ జుకర్‌బర్గ్.. ఇన్‌స్టాగ్రామ్ టీనేజర్లను అడిక్ట్ చేసిందా? అంతర్గత డాక్యుమెంట్లు బయటపడ్డాయి.. ట్రయల్ హాట్ టాపిక్!

ఈ కేసును కొందరు నిపుణులు “బిగ్ టెక్‌కు టోబాకో మూమెంట్”గా అభివర్ణిస్తున్నారు. గతంలో పొగాకు కంపెనీలు సిగరెట్లు హానికరమని తెలిసినా, ఆ విషయాన్ని పూర్తిగా వెల్లడించలేదన్న విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

అంతర్గత పరిశోధనా ఫలితాలు బహిర్గతం కాకపోతే, పొగాకు కంపెనీలలా తప్పించుకోవచ్చని ఒక మెటా ఉద్యోగి వ్యాఖ్యానించినట్లు కోర్టులో ప్రస్తావన వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి అధిక వినియోగం సమస్యాత్మకమై ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, దాన్ని స్పష్టమైన వ్యసనంగా వర్గీకరించడం సరికాదని వాదించారు.

జుకర్‌బర్గ్ కోర్టులో “మేము వినియోగదారులకు విలువైన సంబంధాలను, సమాజాలను అందిస్తున్నాం” అని వాదించే ప్రయత్నం చేసారు. అయితే ఈ విచారణ ఫలితం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా నియంత్రణా విధానాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.

కీలక మలుపు దిశగా టెక్ రంగం

ఈ కేసు కేవలం ఒక కంపెనీపై ఆరోపణలకే పరిమితం కాదు. ఆల్గారిథమ్ డిజైన్, డిజిటల్ ఉత్పత్తులపై బాధ్యత, పిల్లల రక్షణ చట్టాలు వంటి అంశాలపై పెద్ద చర్చకు ఇది మార్గదర్శిగా మారే అవకాశం ఉంది. ఇలాంటి వందలాది కేసులు అమెరికాలో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో, లాస్‌ఏంజెల్స్ కోర్టు తీర్పు కీలకంగా మారనుంది.

తల్లిదండ్రులు పిల్లల ఫోన్ వినియోగంపై అప్రమత్తంగా ఉండడం, డిజిటల్ అక్షరాస్యతపై దృష్టి పెట్టడం మరింత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.