WhatsApp Username | వాట్సాప్‌లో ఇక మీ మొబైల్ నంబర్ సేఫ్.. అందుబాటులోకి యూజర్‌నేమ్ ఫీచర్!
WhatsApp Username | వాట్సాప్ యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్‌నేమ్ ఫీచర్‌ను మెటా రోలౌట్ చేసింది. మీ మొబైల్ నంబర్‌ను బహిర్గతం చేయకుండానే ఇతరులకు మెసేజ్‌లు, కాల్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో యూజర్లకు మాత్రమే దీన్ని తెచ్చింది.
WhatsApp Username | ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్‌డేట్లు ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీ వ్యక్తిగత నంబర్‌ను బయటపెట్టకుండానే ఇతరులకు మెసేజ్‌లు పంపడంతో పాటు, కాల్స్ చేసుకునేందుకు ఉపయోగపడేలా యూజర్‌నేమ్ ఫీచర్‌ను రోలౌట్ చేసింది. ఈ ఫీచర్ గురించి చాలా నెలల కిందటే వాట్సాప్ మాతృసంస్థ మెటా అప్‌డేట్ ఇచ్చింది. కానీ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత యూజర్‌నేమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.
అసలేంటి ఫీపచర్?
ఇప్పటివరకు కొత్తగా ఎవరితో అయినా చాట్ చేయాలంటే మన వ్యక్తిగత ఫోన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కొత్త వ్యక్తులకు ఇలా ఫోన్ నంబర్ ఇవ్వడం వల్ల కొందరికి, ముఖ్యంగా అమ్మాయిలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుంటాయి. పర్సనల్ నంబర్‌కు వేరే వేరే మార్గాల ద్వారా సంప్రదించే అవకాశం ఉంటుంది. అదే యూజర్ నేమ్ ఇస్తే అవతలి వ్యక్తికి మన మొబైల్ నంబర్ బహిర్గతం అవ్వదు. దీనివల్ల వాట్సాప్‌లో బ్లాక్ చేసినప్పుడు ఇతరత్రా మార్గాల్లో మిమ్మల్ని సంప్రదించడానికి కుదరదు. ఇలా మీ మొబైల్ నంబర్ సేఫ్‌గా ఉంటుంది.
యూజర్‌నేమ్‌కూ కొన్ని కండీషన్లు
యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకోవడానికి కూడా వాట్సాప్ పలు నియమాలను అమలు చేయనుంది. ఈ యూజర్ నేమ్‌ను కనీసం 3 అక్షరాల నుంచి 35 అక్షరాల వరకు పెట్టుకోవచ్చు. ఇందులో a-z, 0-9, డాట్ (.), అండర్‌స్కోర్(_) మాత్రమే ఉయోగించాల్సి ఉంటుంది. ఇక యూజర్ నేమ్ www. తో ప్రారంభం అవ్వకూడదు. అలాగే .com, .in, .net, .edu వంటి డొమైన్‌లతో కూడా ఎండ్ అవ్వకూడదు. ఇక యూజర్‌నేమ్ కోసం మెటా ప్లాట్‌ఫామ్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఉన్న యూజర్‌నేమ్‌లను కూడా లింక్ చేసుకునే అవకాశం ఉండొచ్చని సమాచారం. ఒకే యూజర్‌నేమ్‌ను అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లో ఉపయోగించాలంటే యూజర్ తన అకౌంట్‌ను ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే ఒకే రకమైన యూజర్ నేమ్‌ను వాడకపోవడమే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కొందరికే!
ప్రస్తుతం ఈ యూజర్‌నేమ్ ఫీచర్ అందరికీ అందుబాటులోకి రాలేదు. పరిమిత సంఖ్యలో యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని WABetaInfo వెల్లడించింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. మీకు ఈ ఫీచర్ అందుబాటులో ఉందో లేదో తెలియాలంటే.. ముందుగా వాట్సాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ యూజర్‌నేమ్ సెట్ చేసుకునే ఆప్షన్ ఉందో లేదో చూసుకోవాలి. ఆప్షన్ కనిపిస్తే యూజర్‌నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మరికొద్దిరోజులు ఈ ఫీచర్ కోసం ఎదురుచూడాల్సిందే.!
Read More:
WhatsApp | వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram