WhatsApp | వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!

Whatsapp | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో భారీ మార్పులు వచ్చాయి. సామాన్యులు సైతం సులభంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకునేలా కొత్తగా మెటా ఏఐ ట్యాబ్‌ను తీసుకొచ్చింది. దీంతో వాట్సాప్ యాప్‌లోనే ఇమేజ్‌లు క్రియేట్ చేసుకోవడంతో పాటు విజువల్ యానిమేషన్స్ చేయవచ్చు.

WhatsApp | వాట్సాప్‌లో భారీ అప్‌డేట్.. కొత్తగా మెటా ఏఐ ట్యాబ్, పేరెంట్స్ కోసం స్పెషల్ ఫీచర్!

WhatsApp | ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్న వాట్సాప్ ఇప్పుడు సరికొత్త అప్‌డేట్ తీసుకొచ్చింది. సైడ్ బార్‌లో ఇప్పటివరకు ఉన్న కమ్యూనిటీస్‌ ట్యాబ్‌ను తీసేసి మెటా ఏఐ ట్యాబ్ ( Meta AI Tab ) ఫీచర్‌ను జోడించింది. దీని ద్వారా సామాన్యులు సైతం సులభంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( Artificial Intelligence ) సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విషయాన్ని WAbetainfo వెల్లడించింది.

వాట్సాప్ యాప్‌లో దిగువన ఉండే నావిగేషన్ బార్‌లోని కమ్యూనిటీ ట్యాబ్ స్థానంలో ఈ మెటా ఏఐ ట్యాబ్‌‌ను చేర్చింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా కొద్దిమంది ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. తొందరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.

మెటా ఏఐతో ఒకే చోట అన్ని ఏఐ టూల్స్

కొత్తగా ప్రవేశపెట్టిన మెటా ఏఐ ట్యాబ్‌ ద్వారా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. మెటా ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడటం, ఏఐ ద్వారా ఇమేజెస్ క్రియేట్ చేయడం, విజువల్స్ యానిమేట్ చేయడం వంటి ఫీచర్లను డైరెక్ట్‌గా ఉపయోగించుకోవచ్చు.

కొత్తగా వాయిస్ ఏఐ చాట్

మెటా ఏఐ ట్యాబ్‌తో పాటు వాట్సాప్ రియల్ టైమ్ వాయిస్ ఇంటరాక్షన్ అనే కొత్త ఫీచర్‌ను కూడా మెటా పరీక్షిస్తోంది. యూజర్లు సెర్చ్ బార్‌లో ఉన్న వాయిస్ బటన్ ద్వారా లేదా మెనూలో ఉన్న షార్ట్‌కట్ ద్వారా మెటా ఏఐతో లైవ్ వాయిస్ సంభాషణ ప్రారంభించవచ్చు. ఇక మెటా ఏఐలో అడిగే ప్రతి ప్రశ్నకు ప్రత్యేక చాట్ థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఆ చాట్‌కు టైటిల్ ఇచ్చుకోవడం ద్వారా తర్వాత మళ్లీ ఆ చాట్ కావాలని అనుకున్నప్పుడు సులభంగా కనిపెట్టవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న వాట్సా్ప్ బీటా వెర్షన్ 2.26.10.5లో కనిపించింది. తొందరలోనే ఇది అందరు యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

పిల్లల కోసం పేరెంటింగ్ మేనేజ్‌డ్ అకౌంట్లు

వాట్సాప్‌ మరో కీలక భద్రతా ఫీచర్‌ను కూడా ప్రకటించింది. పేరెంట్ మేనేజ్‌డ్ అకౌంట్స్ ద్వారా తల్లిదండ్రులు తమ అకౌంట్‌తో పిల్లల వాట్సాప్ అకౌంట్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. దీనిద్వారా తెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లు రిక్వెస్ట్ ఇన్‌బాక్స్‌లోకి వెళ్తాయి. వాటిని తల్లిదండ్రులు పరిశీలించి, అంగీకరిస్తేనే పిల్లల వాట్సాప్ అకౌంట్‌లోకి వస్తాయి.

Read More:

iPhone Fold | యాపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్.. రిలీజ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు లీక్!

10 లక్షల్లోపే ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ SUV.. 2026 కియా సోనెట్ కొత్త వేరియంట్లు వచ్చేశాయి!