Sand Dredging | కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్

కాకినాడ సముద్రంలో భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుక డ్రెడ్జింగ్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. మాజీ ఎంపీ హర్షకుమార్ దీనిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ విచారణకు డిమాండ్ చేశారు.

Sand Dredging | కాకినాడ సముద్రంలో ఇసుక దొంగలు..వీడియో వైరల్

అమరావతి : ఏపీ తీరం కాకినాడ సముద్రంలో ఇసుక దొంగల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. సముద్రంలో భారీ యంత్రాలతో ఇసుకను డ్రెడ్జింగ్ చేస్తున్నారని వీడియోను మాజీ ఎంపీ హర్షకుమార్ విడుదల చేశారు. భారీ షిప్ లు, యంత్రాలతో జరుగుతున్న ఇసుక డ్రెడ్జింగ్ ఈ వీడియో చూసిన నెటిజన్లు..వాగులు, నదులు, సముద్ర తీరాలే కాదు.. చివరకు సముద్రాలను కూడా ఇసుక దొంగలు వదలడం లేదంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పర్యావరణ పరిరక్షణకు ఏమై పోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

హర్షకుమార్ స్వయంగా ఓ బోట్ లో లైఫ్ జాకెట్ తో ప్రయాణిస్తూ సముద్రంలో ఇసుక అక్రమ త్రవ్వకాల వీడియో వివరాలను లైవ్ లో వెల్లడించారు. పూర్తిగా అనధికారికంగా ఈ త్రవ్వకాలు జరుగుతున్నాయని, దీనిపై జిల్లా కలెక్టర్, ఏపీ ప్రభుత్వం ఏలా స్పందిస్తుందో చూడాలన్నారు. లేదంటే దీనిపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలకు, దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. సముద్ర లోతు పెంపు, షిప్ ల లంగర్ కోసం పేరుతో అనధికార డ్రెడ్జింగ్ చేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని హర్షకుమార్ ఆరోపించారు. ప్రభుత్వానికి ఫైన్ లు కూడా కట్టడం లేదని వెల్లడించారు. దీనిపై సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

కోడిగుడ్లకు యుద్దం ఎఫెక్ట్..సగానికి తగ్గిన ధరలు!
Gen Z | ఎన్ని తరాలు మారినా మొగుడు చెప్పిందే పెళ్లాం వినాల్సిందేనా.. జెన్‌ జెడ్‌లోనూ అవే పాతకాలపు ఆలోచనలు