Site icon vidhaatha

Game Changer|గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్ రివ్యూ.. విజువ‌ల్స్ కేక కాక‌పోతే..!

Game Changer|ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ నుండి మ‌రో పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజ‌ర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌కి జోడీగా కియార అద్వానీ న‌టించింది. మూవీని సంక్రాంతి కానుక‌గా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్నారు. భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ల‌క్నోలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి రిలీజ్ చేశారు. టీజర్ అయితే కేక పెట్టించింది.ఇందులో రామ్ అంత మంచోడు ఇంకోడు లేడు అని ముందు చూపించారు .. కానీ వాడికి కోపం వస్తే.. వాడంత చెడ్డోడు ఇంకోడు ఉండడు అంటూ ప‌వర్ ఫుల్ డైలాగ్‌తో ప‌రిచయం చేశారు.

టీజర్ చివ‌ర‌లో ఐ యామ్ అన్‌ప్రిడిక్టబుల్ అని చెప్పించారు.ఇందులో చరణ్‌ మూడు డిఫరెంట్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. కుర్రాడిగా, ఆ తర్వాత ప్రభుత్వ అధికారిగా, అలాగే రాజకీయ నాయకుడిగా కనిపించారు. కుర్రాడి లుక్‌లో ఓ వైపు గేమ్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఫైట్లు, హీరోయిన్‌తో లవ్‌ ట్రాక్ వంటివి సెట్ చేశాడు. ఇక ఆఫీస‌ర్ అవ‌తారంలో జనం గురించి సన్నివేశాలు, ప్రత్యర్థులను ఎదుర్కునే సన్నివేశాలు వంటివి చూపించారు. రాజ‌కీయ‌నాయ‌కుడిగా కూడా అద‌ర‌గొట్టాడు. ఎత్తుల‌కి పై ఎత్తులు వేస్తూ ఒక్కొక్క‌రిని చెడుగుడు ఆడిన‌ట్టు క‌నిపిస్తుంది. రామ్ చరణ్ ఇప్పటి వరకు పొలిటీషియన్‌గా తెరపై కనిపించలేదు. దాంతో ఈ సినిమాపై మెగా అభిమానులు మొదటి నుంచి భారీ అంచనాలు పెంచుకోగా.. టీజర్‌లో స్టూడెంట్‌గా, ఆఫీసర్‌గా, పొలిటీషియన్‌గా కూడా పంచెకట్టుతో రామ్ చరణ్ కనిపించారు.

కథ పరంగా హుక్‌ చేసే పాయింట్‌ని ఎక్కడ కూడా రివీల్‌ చేయలేదు. ఏం చెప్పబోతున్నారనేది ఊహించేలా టీజర్‌ లేదు. అన్‌ ప్రిడిక్టబుల్‌గా టీజర్‌ ఉంది. బాగుందా? బాగాలేదా అనే కన్‌ ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ప్రతి సీన్‌ విజువల్‌ గా వండర్‌ అని చెప్పొచ్చు. ఓ కమర్షియల్‌ సినిమాని ఇంతటి గ్రాండియర్‌గా చూపించడం మామూలు కాదు. కాక‌పోతే కథ పరంగానే, ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో హైప్‌ ఇచ్చే విషయంలోనే డౌట్‌ కొడుతుంది. జస్ట్ యావరేజ్‌, బిలో యావరేజ్‌ టీజర్‌గా చెబుతున్నారు. తెలుగు, తమిళ్‌తో పాటు గేమ్ ఛేంజర్ మూవీని తమిళ్, హిందీలోనూ రిలీజ్ చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సజావుగా నిర్వహించే అధికారి పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది.

Exit mobile version