Geetu Royal| గీతూ రాయల్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న గీతూ రాయల్ చాలా యాక్టివ్‌గా కనిపిస్తూ కప్ కొడుతుందా అనిపించింది. కాని ఊహించని విధంగా ఆమె బయటకు వచ్చింది. అయితే గీతూ రాయల్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. అది గీతూ రాయల్ పై ప్రేక్షకుల్లో వ్యతిరేకతకు కారణమైందని, దాని వల్లనే త్వరగా బయటకు వచ్చిందని అంటున్నారు.
నాగార్జున ఎంత హెచ్చరించిన కూడా గీతూ రాయల్ వినకుండా చాలా ఓవర్ కాన్ఫిడెంట్‌తో ఆడుతూ 9వ వారంలోనే బయటకు వచ్చింది. టైటిల్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిన గీతూ రాయల్ తన ఎలిమినేషన్ ని తట్టుకోలేకపోయింది.
నన్ను పంపకండి అంటూ హోస్ట్ నాగార్జునను వేడుకుంది. రూల్ అంటే రూలే అని నాగార్జున ఎలిమినేట్ చేశాడు. పీఆర్ ని పెట్టుకోమని కొందరు సలహా ఇచ్చారు. నేను పీఆర్ లేకుండా వెళ్లి తప్పు చేశానంటూ బయటకు వచ్చిన గీతూ రాయల్ చెప్పుకొచ్చింది.అయితే కంటెస్టెంట్‌గా వెళ్లి బయటకు వచ్చేసిన గీతూ రాయల్ బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా వ్యవహరించడం విశేషం. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేసింది. కాగా గీతూ రాయల్ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ కన్నీరు పెట్టిస్తుంది. ఆమె తన కొడుకును కోల్పోయింది. ఇంతకీ ఎవరా కొడుకు అంటే పెట్ క్యాట్. చాలా కాలంగా గీతూ రాయల్ ఓ పెట్ క్యాట్ పెంచుకుంటుండగా, దాని పేరు ఓరియో. బిగ్ బాస్ హౌస్లో కూడా గీతూ రాయల్ ఓరియో ని తలచుకుని చాలా ఎమోషనల్ అయింది.
తాజాగా ఓరియో మరణంతో గీతూ రాయల్ తీవ్ర వేదనకు గురైంది. ఓరియో తనకు కొడుకు కంటే ఎక్కువని, తన కొడుకు మరణానికి సెక్యూరిటీ గార్డ్స్ నిర్లక్ష్యమే కారణం అని గీతూ రాయల్ ఆరోపిస్తుంది. తమ కమ్యూనిటీలోకి వీధి కుక్కలు వచ్చి.. ఓరియో మీద దాడి చేసి చంపేశాయని గీతూ పేర్కొంది. అయితే గీతూ చాలా ఎమోషనల్ అవుతూ ఓరియోకి గీతూ రాయల్ అంత్యక్రియలు జరిపింది. స్నానం చేయించి, పొలంలో ఖననం చేసి వీడియోలో గీతూ రాయల్ గుండెలు పగిలేలా ఏడుస్తూ కనిపించింది.. కాగా కొన్నేళ్ల క్రితం గీతూ రాయల్ వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకోగా, వీరి వైవాహిక జీవితంలో ఇప్పటి వరకు పిల్లలు లేరు.