Site icon vidhaatha

Allu Sirish | త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న అల్లు హీరో శిరీష్‌..! ఇంతకీ అమ్మాయి ఎవరో తెలుసా..?

Allu Sirish | టాలీవుడ్‌ హీరో అల్లు శిరీష్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెబుతూ వివాహ బంధంతో ఓ ఇంటివాడు కానున్నట్లు సమాచారం. శిరీష్‌ ఓ అమ్మాయిని ప్రేమించాడని.. ఆమెను మనువాడబోతున్నట్లు తెలుస్తున్నది. ముంబయిలో యాక్టింగ్‌ నేర్చుకుంటున్న సమయంలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడని తెలుస్తున్నది. ఈ విషయాన్ని ఇంటి పెద్దలకు చెప్పి ఒప్పించాడని.. వారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో త్వరలోనే పెళ్లి జరుగనున్నట్లు తెలుస్తున్నది. అయితే, ఇందులో ఎంత వరకు నిజం ఉన్నదో తెలియదు కాదని ఈ వార్త సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నది. అలాగే, ఆ అమ్మాయి ఎవరు ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. గతంలో ఓ హీరోయిన్‌తో ఘాటు ప్రేమలో ఉన్నారని ప్రచారం జరిగింది. ఊర్వశివో రాక్షసివో సినిమా చేస్తున్న సమయంలో అను ఇమ్మాన్యూయేల్‌తో లవ్‌లో పడ్డాడని పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఆ వార్తలను అల్లు శిరీష్‌ కొట్టిపడేశారు. నటీనటుల జీవితాల్లో ఇలాంటి వదంతులు సర్వసాధారణమేనని.. కోస్టార్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు రావడం సహజమని పేర్కొన్నాడు. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయని.. ఇద్దరం మంచి స్నేహితులమని చెప్పుకొచ్చాడు. ఇక అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్‌ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన సోదరుడు అల్లు అర్జున్‌కు వచ్చినంత క్రేజ్‌ను మాత్రం సంపాదించుకోలేకపోయారు.

‘గౌరవం’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన శిరీష్‌.. కొత్త జంట, ఏబీసీడీ, క్షణం క్షణం , శ్రీరస్తు శుభమస్తు, ఊర్వశివో రాక్షసివో సినిమాలతో గుర్తింపును తెచ్చుకున్నారు. అయితే, ఆయా సినిమాలు సరైన బ్రేక్‌ను ఇవ్వలేదు. ఇటీవల ‘బడ్డీ’ సినిమాతో అభిమానుల ముందుకు రాగా.. ఇది కూడా నిరాశ పరిచింది. శిరీష్‌ ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో ఉంటూ వస్తారు. సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే సాయం అందిస్తుంటారు. ఓ పేద విద్యార్థికి ల్యాప్‌టాప్‌ను అందించాడు. ఇక శిరీష్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version