Site icon vidhaatha

IND vs SL|నేడు శ్రీలంక‌, భార‌త్ తొలి వ‌న్డే.. ఎప్పుడు ప్రారంభం అవుతుంది, స్ట్రీమింగ్ ఎందులో అంటే.!

IND vs SL| శ్రీలంక‌తో జ‌రిగిన టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించి క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇప్పుడు వ‌న్డే సిరీస్‌పై గుర్తు పెట్టింది. సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ల‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి ఆట‌గాళ్ల రాక‌తో భార‌త జ‌ట్టు బ‌లం పెరిగింది. హెడ్ కోచ్‌గా తొలి విజ‌యాన్ని అందుకున్న గౌత‌మ్ గంభీర్ ఇప్పుడు వ‌న్డే విజ‌యం కూడా సాధించాల‌నే క‌సితో ఉన్నాడు. అంతేకాదు వ‌చ్చే ఏడాది పాకిస్తాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025కి జ‌ట్టును స‌న్న‌ద్దం చేసేందుకు ఇప్ప‌టి నుండే ప్ర‌ణాళిక‌లు మొద‌లు పెట్టాడు. శుక్రవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరుగనుంది. రానున్న చాంపియన్స్‌ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని జట్టులో మార్పులు, చేర్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ విషయంలో కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ మధ్య పోటీ నెలకొన్నది. కెప్టెన్‌ రోహిత్‌, చీఫ్‌ కోచ్‌ గంభీర్‌ ఎవరిని జ‌ట్టులోకి తీసుకుంటారు అనేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది. టీ20లకు వీడ్కోలు పలికిన స్టార్‌ ప్లేయర్లు రోహిత్‌, కోహ్లీ తిరిగి జట్టులోకి రావడం టీమ్‌ఇండియాకు అదనపు బలం కానుంది. మరోవైపు కొత్త కెప్టెన్‌ చరిత అసలంక నేతృత్వంలో లంక బరిలోకి దిగనుంది. టీ20 సిరీస్‌ ఓటమికి వన్డేల్లోనైనా ప్రతీకారం తీర్చుకోవాలని లంక పట్టుదలతో కనిపిస్తున్నది. భార‌త జ‌ట్టు విదేశాల్లో ఆడే మ్యాచుల‌కు సంబంధించిన హ‌క్కులు అన్నీ సోనీ నెట్‌వ‌ర్క్‌ సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు అన్ని సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయ‌నున్నారు. ఓటీటీలో సోనీ లివ్ లో ప్ర‌సారం అవుతాయి.

మొబైల్‌లో ఫ్రీగా చూడాలి అంటే హాట్ స్టార్, జియో సినిమా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో శ్రీలంక వ‌న్డే సిరీస్ రాదు. కేవ‌లం సోనీ లివ్ ఓటీటీలో మాత్ర‌మే మీరు చూడాల్సి ఉంటుంది. ఇందుకు స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాలి. అయితే.. మొబైల్‌లో ఫ్రీగా చూడాల‌నుకుంటే జియోటీవీ యాప్‌లో చూడొచ్చు. జియో టీవీ యాప్‌లో ఛానెల్స్‌లో సోనీ టీవీ నెట్ వ‌ర్క్ ఛానెల్స్‌ను ఎంచుకోని వ‌న్డే సిరీస్‌ను ఉచితంగా చూడొచ్చు.వ‌న్డే సిరీస్‌లోని మ్యాచులు మొత్తం కొలంబో వేదిక‌గానే జ‌ర‌గ‌నున్నాయి. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు మ్యాచ్ ఆరంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కి వ‌రుణుడు అడ్డు ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది

Exit mobile version