Sundeep Kishan| ఇటీవల హైదరాబాద్ నగరంలోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రమాణాలు పాటించకుండా శుభ్రత,నాణ్యత లేని హోటల్స్‌పై తక్షణమే చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌లోని పలు హోటళ్లలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని వివాహ భోజనం హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయగా.. కాలం చెప్పిన బియ్యంతోపాటు నాసిరకం వస్తువులతో ఆహార పదార్థాలు తయారీ చేస్తున్నట్లు గుర్తించినట్టు వార్తలు వచ్చాయి.
వండిన అలాగే వండిన ఆహార పదార్థాలు నిలువ చేసి ఫ్రిజ్లో పెడుతున్నారని, కస్టమర్స్ వచ్చినప్పుడు తిరిగి వాటిని వేడి చేసి ఇస్తున్నారని గుర్తించారు. కిచెన్లో పరిశుభ్రత లోపించిందని.. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బెరను వారు గుర్తించారు. ఫుడ్ తయారు చేస్తున్న వారి ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ కూడా లేవని.. వంటపాత్రలను క్లీన్ చేసిన నీరు కూడా అక్కడే నిల్వ ఉండడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సందీప్ కిషన్ రెస్టారెంట్ లో పరిస్థితి ఇలా ఉందంటూ చాలా ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఈ రెస్టారెంట్ పరువు తీసే విధంగా ఉండడంతో, అందులో నిజం లేదని, ఆ ఫొటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని ‘వివాహ భోజనంబు’ టీమ్. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసారు.
మీడియా మిత్రలు ఆసక్తికర హెడ్డింగ్స్ పెట్టే ముందు అసలు నిజాలేంటో తెలుసుకోవాలి. గత ఎనిమిదేళ్లుగా మేము వివాహ భోజనంబు అనే పేరుతో చాలా నమ్మకమైన సేవలు అందిస్తూ వస్తున్నాం. ఎప్పుడు కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. 2022 ఎక్స్పైరీ డేట్ తో ఉన్న చిట్టి ముత్యాలు రైస్ బ్యాగ్ తమ హోటల్ లో ఉన్న మాట వాస్తవమే కాని అది మా వెండర్ ఒకరు శాంపిల్ కోసం పంపితే అలా పెట్టి ఉంచాం తప్ప దాని సీల్ తీయలేదు. ఇక మా కిచెన్‌లో నీళ్లు నిలిచిపోయాయి అన్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవం. ఆ ఫొటోలు నీళ్లు బయటకు వెళుతున్న సమయంలో తీసిన ఫొటోలు. మేము టేస్టింగ్ సాల్గ్ వాడము. ఆ ఫొటోలు మా కిచెన్‌కి సంబంధించినవి కావు. ఫుడ్ సేఫ్టీ అధికారులు కుకింగ్ అండ్ సేఫ్టీకి సంబంధం లేని చిన్న చిన్న విషయాలను మాత్రమే గుర్తించారు. వాటిని కూడా మేం సరిదిద్దుకునే పనిలో ఉన్నాం. నాణ్యతా, శుచి, శుభ్రతా విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదు’ అని ప్రకటనలో క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్.
అయితే వివాహ భోజనంబు హోటల్‌లో గడువు ముగిసిన 25 కేజీల చిట్టి ముత్యాల బియ్యాన్ని గుర్తించడంతో పాటు నాణ్యత లేని ఈ బియ్యంతో పలు ఆహార పదార్ధాలని తయారు చేస్తున్నట్టు అధికారులు తెలియజేశారు. మరోవైపు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడి పరిస్థితులని సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.మరి దీనిపై సందీప్ కిషన్ ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి. ఇక సందీప్ ఓవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటున్న సందీప్.. చాలా కాలం క్రితమే ఫుడ్, రెస్టారెంట్ బిజినెస్ లోకి దిగారు.