Kalki 2898 AD Movie | ప్రభాస్‌ ‘కల్కీ ఏడీ2898 ఏడీ’ మూవీ గురించి ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌..!

Kalki 2898 AD Movie | పాన్‌ ఇండియా ప్రభాస్‌ హీరోగా.. విశ్వనటుడు కమల్‌ హసల్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కమల్‌ హసన్‌ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కింది. ఈ సినిమాపై భారీగా అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఏడో పాన్‌ ఇండియా చిత్రం కల్కీ 2898 ఏడీ.

  • Publish Date - June 27, 2024 / 08:25 AM IST

Kalki 2898 AD Movie | పాన్‌ ఇండియా ప్రభాస్‌ హీరోగా.. విశ్వనటుడు కమల్‌ హసల్‌, బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు కమల్‌ హసన్‌ నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై మూవీ తెరకెక్కింది. ఈ సినిమాపై భారీగా అంచనాలే ఉన్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న ఏడో పాన్‌ ఇండియా చిత్రం కల్కీ 2898 ఏడీ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9వేలకుపైగా స్క్రీన్స్‌లో విడుదలవుతున్నది. తెలుగులో 1600పైగా స్కీన్స్‌లో రిలీజ్‌ అవుతున్నది. హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం మొత్తం నాలుగువేలకుపైగా స్క్రీన్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌కు మేకర్స్‌ ప్లాన్‌ చేశారు. అలాగే, విదేశాల్లోనూ దాదాపు 4500 పైగా థియేటర్స్‌లో ‘కల్కి 2898 ఏడీ’ మూవీ విడుదలవనున్నది. ఇప్పటికే ఓవర్సీస్‌లో మూవీ ప్రీమియర్స్‌ ద్వారానే దాదాపు 3 మిలియన్‌ డాలర్లను వసూలు చేసి ఔరా అనిపించింది.

ఇక దేశవ్యాప్తంగా బుకింగ్స్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక అబితాబ్‌ బచ్చన్‌ మనం, సైరా నరసింహారెడ్డి తర్వాత తెలుగులో ఆయన నటించిన చిత్రం ఇదే కావడం విశేషం. ఈ రెండు చిత్రాల్లో ఆయన అలా వచ్చి వెళ్లగా.. ఇందులో కీలకపాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన మేకప్‌ వేసుకునేందుకే మూడుగంటలు.. తీసేందుకు రెండు గంటల సమయం పట్టింది. దాదాపు 80 సంత్సరాల వయసులోనే అమితాబ్‌ అశ్వత్థామ పాత్రలో నటించడం విశేషం. ఇక కమల్ హాసన్ దాదాపు ‘శుభ సంకల్పం’ తర్వాత తెలుగులో డైరెక్ట్ నటించిన సినిమా కూడా ఇదే. ఇక బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం. ఇక మూవీకి భారతీయ సినీ పరిశ్రమలో ఏ సినిమాకు లేని విధంగా టికెట్స్ అమ్ముడయ్యాయి. నాన్ హాలీడేలోనూ ఈ సినిమా ఈ రేంజ్ లో దుమ్ము రేపడం ఖాయంగా కనిపిస్తున్నది. ఇక తెలుగు రాష్ట్రాల్లో టికెట్స్‌ రేపు పెంపుతో పాటు అదనపు షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.

తెలంగాణలో రూ.75 సింగిల్ స్క్రీన్స్ పెంచారు. మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 8 రోజుల వరకు టికెట్ పెంపుకు అనుమతులు మంజూరు చేసిన ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం. ఇక ఏపీలో సింగిల్ స్క్రీన్స్ రూ.75, మల్టీప్లెక్స్‌లో రూ.125 టిక్కెట్ రేటు పెంపునకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. రెండువారాల పాటు అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ ‘భైరవ’ పాత్రలో నటించగా.. దీపిక పదుకొనె, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. ఇక విజయ్ దేవరకొండ, రాజమౌళి, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రామ్ గోపాల్ వర్మ, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక, పశుపతి తదితర స్టార్‌ నటీనటులు స్పెషల్‌ అప్పియరెన్స్‌గా కనిపించనున్నారు. తెలుగు సహా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.370 కోట్ల బిజినెస్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా దాదాపు రూ.400 కోట్లు రికవరీ కావడం విశేషం.

Latest News