Jabardast Chalaki Chanti| బుల్లితెరతో పాటు వెండితెరపై సందడి చేసిన వారిలో చలాకి చంటి (chalaki Chanti) ఒకరు. ఆయన జబర్ధస్త్ (Jabardasth)షోతో బాగా పాపులర్ అయ్యారు. ఒకప్పుడు నిత్యం సందడి చేసే చలాకి చంటి ఇప్పుడు కనిపించకుండా పోయాడు. కొన్ని రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురై అనంతరం కోలుకున్నారు. ప్రస్తుతం టీవీ షోలకి సైతం దూరంగా ఉంటున్న చంటి తాజాగా ఓ ఇంటర్వ్యూ( Inrview)లో ఆసక్తికర కామెంట్స్ చేశాడు. కొంత మందిపై తన ఆవేదన సైతం బయట పెట్టాడు. తాను హాస్పిటల్ పాలైనప్పుడు ఒకరిద్దరు తప్పా, ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరూ కూడా నన్ను పలకరించలేదు. అంతకుముందు వరకూ నాతో ఉన్నవారు కాని అలాంటి సమయంలో పలకరించింది లేదు అని చంటి అన్నారు.
నేను బాగా సంపాదిస్తున్నా అని అందరు అనుకుంటారు. అలా కనిపించకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు, దేనికి పిలవరు కూడా. అందుకే పరిస్థితి ఎలా ఉన్నా కూడా కొన్ని మెయింటైన్ చేయాలి. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఇక్కడ ఎవరైనా సరే నువ్వు బాగుంటేనే ‘బాగున్నావా’ అని అడుగుతారు. బాగోలేకపోతే కనిపించకుండా పోతారు. ఇది కలియుగం .. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి లేదు .. ఎవరిపై ఆశలు పెట్టుకోకూడదు” అని చెప్పాడు. . డబ్బు ఉంటేనే ఈ లోకం మనల్ని పలకరిస్తుందని, చివరకు మనం పెంచుకున్న కుక్క అయినా సరే దానికి రోజు చికెన్ మటన్ తినిపిస్తేనే వచ్చి తోక ఊపుతుందని ఏమీ లేకపోతే దగ్గరకు కూడా రాదంటూ తన మనసులోని బాధని బయటపెట్టాడు చంటి(Chanti).
తనకి ఇప్పుడు అవకాశాలు రాకుండా అడ్డుకుంటున్న వారికి నానా శాపనార్ధాలు పెట్టాడు చంటి. తనకు ఈగో ఎక్కువ అని షూటింగు(Shooting)కు వస్తే చాలా డబ్బు తీసుకుంటానని కొంతమంది తప్పుడు ప్రచారాలు చేశారు. సంబంధం లేని గొడవలలో నన్ను ఇరికించి అవకాశాలు రాకుండా చేశారు. నా పొట్ట కొట్టిన వారు ఎవరు కూడా బాగు పడరు. సర్వనాశనం అవుతారు. అని అన్నారు. వారు సర్వనాశనం అవ్వాలని తాను దేవుడి(GOD)ని కోరుకుంటానని.. అలాంటివారు నాశనం అవడం తాను కళ్ళతో చూస్తానంటూ కూడా చలాకి చంటి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం చంటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.