Jagapathi babu|మరీ ఇంత మంచి త‌న‌మా.. ఇంట్లో పడ్డ దొంగలకు డబ్బు సాయం చేయ‌డ‌మేంటి..!

Jagapathi babu| ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తి బాబు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తి బాబు ఎక్కువ‌గా ఫ్యామిలీ చిత్రాలే

  • Publish Date - April 19, 2024 / 06:55 PM IST

Jagapathi babu| ఒక‌ప్పుడు జ‌గ‌ప‌తి బాబు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించుకున్నాడు. అప్ప‌ట్లో జ‌గ‌ప‌తి బాబు ఎక్కువ‌గా ఫ్యామిలీ చిత్రాలే చేసి ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కి కూడా బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. హీరోగా ఎన్నో సినిమాలు చేసి ప్రేక్ష‌కుల‌ని మెప్పించిన జ‌గ‌ప‌తి బాబు మ‌ధ్య‌లో కాస్త సినిమాల‌కి దూర‌మ‌య్యాడు.నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాతో విలన్‍గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన జ‌గ‌ప‌తి బాబు ఇప్పుడు ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా ఫుల్ క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఆయన సరికొత్త పాత్రలతో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో మెప్పిస్తున్నాడు. ఇప్పుడు జ‌గ‌ప‌తి బాబుని వ‌రుస అవ‌కాశాలు ప‌ల‌క‌రిస్తున్నాయి.

అయితే ఎప్పటికప్పుడు సరికొత్త లుక్స్, లేటేస్ట్ పోస్టులతో జనాలను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటూ ఉంటారు జ‌గ‌ప‌తి బాబు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న జగపతిబాబుకు ఇటీవ‌ల హాలీవుడ్ నుండి పిలుపు వ‌చ్చిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా కూడా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ త‌న‌కు సంబంధించిన అనేక విష‌యాల‌ని షేర్ చేసుకుంటాడు. అలానే ప‌లు ఇంట‌ర్వ్యూల‌లో పాల్గొంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేస్తూ ఉంటారు. అయితే జ‌గ్గూభాయ్ అతి మంచిత‌నం గురించి చెప్పాలంటే ఈ ఒక్క ఘ‌ట‌న గురించి చెబితే స‌రిపోతుంది.

జ‌గ‌ప‌తి బాబు నివాసంలో ఓ సారి కొంద‌రు దొంగ‌లు చోరికి ప్ర‌య‌త్నించారు. అప్పుడు ఆయ‌న పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డంతో వెంట‌నే అరెస్ట్ చేశారు. అయితే దొంగ‌ల భార్య‌లు జ‌గ‌ప‌తి బాబు ఫోన్ నెంబ‌ర్ ఎలా సంపాదించారో తెలియ‌దు కాని వాళ్ల భ‌ర్త‌లు అరెస్ట్ అయిన వెంట‌నే జ‌గ‌ప‌తి బాబుకి కాల్ చేసి.. తాము పిల్లలతో రోడ్డున పడ్డామని కన్నీటి పర్యంతమయ్యారట. ఆ స‌మ‌యంలో జ‌గ్గూ భాయ్ మ‌న‌సు క‌రిగిపోయింది. వెంట‌నే ఆ దొంగ‌ల ఫ్యామిలీలకి డ‌బ్బు సాయం చేశారు. ఏదో అలా సాయం చేసి ఆయ‌న చేతులు దులుపుకోలేదు. ఆ దొంగలు జైలు నుంచి విడుదల అయ్యేవరకు.. వారి ఫ్యామిలీలకు నెల నెలా ఖర్చుల కోసం డబ్బులు పంపారట. ఈ విషయాన్ని జ‌గ‌ప‌తి బాబు ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

Latest News