Janhvi Kapoor| ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కలిసి దేవర అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. జాన్వీకపూర్ తన ఇన్‌స్టాలో దేవర షూటింగ్ అంటే చాలా ఇష్టం అంటూ.. తెలిపింది. అంతే కాదు ఈ షూటింగులో తాను ఏం ఏం తింటుందో కూడా పిక్ ఒకటి పోస్టు చేయగా ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.. అయితే జాన్వీ కామెంట్ బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కు భారీ సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
సినిమాలు షూటింగ్ లలో భోజనం అంటే ప్రభాస్ మనకు గుర్తుకు వస్తాడు. చిత్ర బృందం అందరికి ప్రత్యేకంగా ఫుడ్ చేయించి మరీ తీసుకొస్తాడు. ఇప్పుడు అదే ఎన్టీఆర్ కూడా ఫాలో అవుతున్నట్టు అర్ధమవుతుంది. దేవర షూటింగ్‌లో పాల్గొంటున్న జాన్వీ కపూర్‌కి ఎన్టీఆర్ ఆతిథ్యం ఇచ్చాడని ఆమె పోస్ట్‌ని బట్టి అర్ధమవుతుంది. తారక్ అరేంజ్ చేస్తున్న ఆతిథ్యం చూసి.. వంటల టేస్ట్ చేసి జాన్వీ కపూర్.. ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యిందట. సౌత్ ఇండియన్ ఫుడ్‌కి ఫిదా అయిన జాన్వీ కపూర్.. ఆ వంటకాల గురించి, ఎన్టీఆర్ ఆతిథ్యం గురించి గొప్పగా చెబుతుందట. అంటే ఎన్టీఆర ఆతిథ్యానికి ఆమె ఎంతగా ఫిదా అయిందో జాన్వీ కపూర్ తాజా పోస్ట్‌ని బట్టి అర్ధమవుతుంది.
జాన్వీ కపూర్ ఇన్ స్టా స్టోరీలో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్న డైనింగ్ టేబుల్ పిక్ పోస్ట్ చేసింది జాన్వీ కపూర్. ఈ ఫుడ్స్‌లో ధమ్ బిర్యానీతో పాటు… మటన్ కర్రీ, రాగి సంగటి, చికెన్, పప్పు, కీమా, ఎగ్ కర్రీతో పాటు బెండకాయ కూర, పెరుగు ఇలా రకరకాల నోరూరించే ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్టీఆర్ ఆతిథ్యం అదుర్స్ అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి జాన్వీ కపూర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక జాన్వీ కపూర్ త్వరలో రామ్ చరణ్‌తో కూడా కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా ఎంపికైంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది.