Heroines Promotion For OG Movie | పవన్ ఓజీ మేనియాలో హీరోయిన్స్ సైతం

పవన్ కల్యాణ్ ఓజీ మూవీ రిలీజ్.. రితికా నాయక్, జ్యోతి పూర్వాజ్ సైతం టీ షర్టు ధరించి ప్రమోషన్ చేస్తున్నారు.

విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా అంటే అభిమానుల్లో కనిపించే సందడి నెక్ట్స్ రేంజ్ లో ఉంటుంది. సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ వార్ కథతో తెరకెక్కిన పవన్ సినిమా ఓజీ గురువారం విడుదల కాబోతుంది. ఇందులో పవన్ కల్యాణ్ తోపాటు ప్రియాంకా మోహన్, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రియ రెడ్డిలాంటి వాళ్లు నటించారు. హైదరాబాద్ ప్రసాద్‌ ఐమాక్స్ వద్ద పవన్ అభిమానులు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ ను అభిమానించే నటినటులు సైతం ఓజీ టీ షర్టులు ధరించి సినిమాకు తమవంతు ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా మిరాయ్ సినిమాతో యూత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిన రితికా నాయక్ ఓజీ టీ షర్టు ధరించి పవన్ స్టైల్ ను అనుకరిస్తూ వీడియో చేశారు. సీనియర్ హీరోయిన్..బుల్లితెర నటి జ్యోతి పూర్వాజ్ సైతం ఓజీ టీ షర్టు ధరించి సందడి చేశారు.

తొలి రోజు కలెక్షన్లు రూ.100కోట్లు అంచనా

ఓజీ సినిమాపై పవన్ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే అక్కడక్కడ సినిమా టికెట్లకు వేలం వేసి ఓక్కో టికెట్ 1లక్ష 30వేలకు కొనుగోలు చేసి సినిమాపై మరింత హైప్ పెంచేశారు. ఇకపోతే ఓజీ మూవీ తొలి రోజు కలెక్షన్లు రూ.100 కోట్ల మార్క్ దాటడం ఖాయమేనని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ప్రిమియం షోలు, అడ్వాన్స్ షోలకు కలిపి అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే రూ.75 కోట్లు రావడంతో పవన్ కెరీర్లో ఇప్పటికే అత్యధిక తొలి రోజు వసూళ్ల రికార్డు ఇదే కాబోతుందంటున్నారు.