Pawan Kalyan : రైతులను ఆదుకుంటాం

మోంథా తుపాను ప్రభావిత అవనిగడ్డ నియోజకవర్గంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం పర్యటించారు. కోడూరు, కృష్ణాపురం వద్ద దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

AP Deputy CM Pawan Kalyan

అమరావతి : మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ డిప్యూడీ సీఎం పవన్ కల్యాణ్ గురువారం పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు, కృష్ణాపురం దగ్గర తుపాన్ తో దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన విని, పంట నష్టం వివరాలు తెలుసుకున్నారు. పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి హామీ ఇచ్చారు.

దెబ్బతిన్న రోడ్లు, వంతెనలను, నివాసాలను పవన్ కల్యాణ్ తన పర్యటనలో పరిశీలించారు. తుపాన్ నష్టంపై ప్రభుత్వం అంచనాలు రూపొందిస్తుందని..బాధిత ప్రజలు, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ తెలిపారు.