Tomato | తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ఉచితంగా ‘ట‌మాటా’ పంపిణీ..!

Tomato | ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన టమాటా( Tomato )కు ధ‌ర రాక‌పోవ‌డంతో.. రైతులు( Farmers ) తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. ట‌మాటా వైపు వ్యాపారులు క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. దీంతో రైతులు ఉచితంగానే టమాటాలు పంపిణీ చేసిన ప‌రిస్థితి దాపురించింది తెలంగాణ‌( Telangana )లో.

Tomato | టమాటా లేనిది ఇల్లాలు వంట చేయ‌డం క‌ష్టం. మార్కెట్‌కు వెళ్లారంటే చాలు.. కిలో, రెండు కిలోల ట‌మాటా( Tomato ) ఇంటికి రావాల్సిందే. అయితే ఈ టమాటా ధ‌ర‌లు ఒక్కోసారి ఆకాశాన్నంటుతాయి.. ఒక్కోసారి అస‌లు ధ‌ర‌నే ఉండ‌దు. ఇప్పుడు మార్కెట్‌లో ట‌మాటా ధ‌ర‌లు పూర్తిగా ప‌డిపోయాయి. కేజీ ట‌మాటాను రూ. 10 కి విక్ర‌యిస్తున్నారు. ఒకానొక స‌మ‌యంలో కిలో ట‌మాటా ధ‌ర రూ. 100కు చేరిన దాఖ‌లాలు కూడా ఉన్నాయి. దీంతో మార్కెట్‌కు ట‌మాటా కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చిన కొనే ప‌రిస్థితి లేదు. ఈ క్ర‌మంలో రైతులు ల‌బోదిబో మంటున్నారు.

అయితే ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన టమాటా( Tomato )కు ధ‌ర రాక‌పోవ‌డంతో.. రైతులు( Farmers ) తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్నారు. ట‌మాటా వైపు వ్యాపారులు క‌నీసం క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. దీంతో రైతులు ఉచితంగానే టమాటాలు పంపిణీ చేసిన ప‌రిస్థితి దాపురించింది. అదెక్క‌డో కాదు.. మ‌న తెలంగాణ‌( Telangana )లోనే.. మ‌హ‌బూబాబాద్ జిల్లా( Mahabubabad District )లోనే.

మ‌హ‌బూబాబాద్ జిల్లా ప‌రిధిలోని గూడూరు మండ‌లం భూప‌తిపేట‌కు చెందిన పోగుల కొండ సార‌య్య‌, మోహ‌న్, సురేంద‌ర్ ఒక్కో ఎక‌రంలో ట‌మాటా సాగు చేశారు. శుక్ర‌వారం కొత్త‌గూడ సంత‌( Kothaguda Market )లో ట‌మాటాను విక్ర‌యించేందుకు తీసుకొచ్చారు. చిరువ్యాపారులకు ఇరవై కిలోల పెట్టెను రూ.100కు విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరూ కొనుగోలు చేయలేదు. కనీసం రూ.50కి కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైన ఆ రైతులు.. సంత‌కు వ‌చ్చిన‌ మహిళలందరికీ ట‌మాటాను ఉచితంగా పంపిణీ చేశారు. ఇంకేముంది.. మ‌హిళ‌లు ఎగ‌బ‌డి ఎగ‌బ‌డి ట‌మాటాను అందుకున్నారు.. సంచులు నింపుకున్నారు.

Latest News