Kalvakuntla Kavitha arrest| తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు.

విధాత, హైదరాబాదా్ : నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి అక్రమంగా నిర్మిస్తున్న భవనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికులతో కలిసి ధర్నా నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. హైడ్రా బుల్డోజర్లు అక్కడికి వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించిన కవితతో పాటు పలువురు జాగృతి నాయకులను అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

నార్సింగిలో మూసీ నదిని ఆక్రమించి నిర్మిస్తున్న శ్రీ ఆదిత్య లగ్జరీ అపార్ట్‌మెంట్స్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నాకు దిగారు. రియల్ ఎస్టేట్ వెంచర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ప్రజల నివాసాలు తొలగిస్తామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, పేదల ఇండ్లు కూల్చేసే హైడ్రాకు ఈ అక్రమ వెంచర్ కనిపించడం లేదా అని కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

జాగృతి జనంబాటలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులు, ఇతర నీటి వనరులను ఆక్రమించికడుతున్న భవనాల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. అదే ఖమ్మంలోని వెలుగుమట్లలో 600 మంది అమాయక పేదల ఇళ్లు కూల్చేశారని కవిత విమర్శించారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో దాదాపు 20 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులను ఇబ్బంది పెడుతున్నారు అని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు నెలల పాటు ఆగిన ఈ ప్రాజెక్టు ఎలా పట్టాలెక్కింది.. ఎవరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని, మూసీలో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం, హైడ్రా చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందన్నారు.

Latest News