Mojtaba Hosseini Khamenei | ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ – అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై మిస్సైళ్ల వర్షం కురిపించి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులను మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఖమేనీ వారసుడిగా ఆయన కుమారుడు మోజ్తబా ఖమేనీ(56) నియమితులయ్యారు. మోజ్తబా నియామకంతో ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో కొత్తం శకం ఆవిష్కృతమైంది.
88 మంది మత గురువులతో కూడిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్’ మండలి మోజ్తబా ఖమేనీను సుప్రీం లీడర్‌గా ఎన్నుకుంది. ఖమేనీ మరణం తర్వాత గత కొన్ని రోజులుగా రహస్యంగా జరిగిన చర్చల అనంతరం, మోజ్తబా ఖమేనీని అత్యున్నత నేతగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ నియామకంలో ఇరాన్ అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. సైనిక నాయకత్వం నుంచి వచ్చిన ఒత్తిడి, ప్రస్తుత యుద్ధ వాతావరణంలో స్థిరమైన నాయకత్వం అవసరమనే కారణంతో మోజ్తబా వైపు మత పెద్దలు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
