అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతి

నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం, చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్ రెడ్డి - శోభ దంపతుల కుమార్తె గడుసు నవ్య అమెరికాలోనీ లేక్ కంట్రీ, క్రౌన్ పాయింట్ దగ్గర శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు

  • By: Subbu |    telangana |    Published on : May 18, 2026 12:09 PM IST
అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతి

యువతి మృతి చెందటం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కోమటి రెడ్డి

 

హైదరాబాద్: నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం, చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్ రెడ్డి – శోభ దంపతుల కుమార్తె గడుసు నవ్య అమెరికాలోనీ లేక్ కంట్రీ, క్రౌన్ పాయింట్ దగ్గర శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందటం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.

నవ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి,ఎం.ఎస్ పూర్తి చేసి తల్లి దండ్రులకు చేదోడుగా ఉండాలని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆవేదన కలిగిస్తోందని అన్నారు. తన అభిమాని గడుసు శశిధర్ రెడ్డి సోదరుడు(అన్న) శ్రీనివాస్ రెడ్డి కుమార్తె నవ్య మృతి తనను వ్యక్తిగతంగా కలిచివేసిందని,శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి కూతురును అమెరికాలో ఉన్నత చదువులు చదివించారని,ఎంతో చలాకీగా ఉండే నవ్య మరణం అందరిలో విషాదాన్ని నింపిందని మంత్రి తన బాధను వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసానిచ్చారు.

నవ్య మరణం తీరని లోటని,వారి కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు. నవ్య మృత దేహాన్ని వెంటనే స్వగ్రామానికి తెప్పించేందుకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రాష్ట్ర ఉన్నతాధికారులతో మాట్లాడారు. అమెరికాలోని తానా,ఆటా ప్రతినిధులతో మాట్లాడి మృత దేహాన్ని స్వదేశానికి పంపించేందుకు సహకరించాలని కోరారు.

ఇవి కూడా చదవండి :

క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఏనుగు.. పార్క్‌కు పోటెత్తిన ప‌ర్యాట‌కులు</aSun’s Transit in Taurus | వృష‌భ రాశిలో సూర్యుడి సంచారం.. జూన్ 15 వ‌ర‌కు ఈ మూడు రాశుల వారికి ముప్పుతిప్ప‌లే..!