కవల పిల్లలకు జన్మనిచ్చిన ఏనుగు.. పార్క్‌కు పోటెత్తిన పర్యాటకులు
కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఓ ఆడ ఏనుగు అరుదుగా కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ దృశ్యాలు వైరల్ కావడంతో పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు.
ఇది అసాధారణ చర్య.. ఎందుకంటే ఏనుగులు కవల పిల్లలకు సాధారణంగా జన్మనివ్వవు. కానీ ఈ ఏనుగు మాత్రం కవల పిల్లలకు జన్మనిచ్చి.. అటవీ శాఖ అధికారులను షాక్‌కు గురి చేసింది.. పర్యాటకుల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం కవల ఏనుగులను చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు.
ఉత్తరాఖండ్‌లోని కార్బెట్ నేషన్ పార్కు ఏనుగుల ఆవాసానికి ప్రసిద్ధి. ఈ పార్కులో మొత్తం 1200కు పైగా ఏనుగులు ఉన్నాయి. ఇవి తమ సంతతిని వృద్ధి చేసుకుంటూ.. పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాయి. అయితే ఇటీవల ఓ ఆడ ఏనుగు కవల పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో అటవీ శాఖ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఏనుగుతో పాటు దాని కవల పిల్లలు సురక్షితంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
ఇక కవల ఏనుగు పిల్లల దృశ్యాలను జంగిల్ సఫారీకి వెళ్లిన వన్యప్రాణి సంరక్షకుడు సంజయ్ చిమ్మవాల్ చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఏనుగు పిల్లల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇక విషయం తెలుసుకున్న పర్యాటకులు ఏనుగు పిల్లలను చూసేందుకు కార్బెట్ నేషనల్ పార్కుకు పోటెత్తారు.
ఏనుగుల గర్భధారణ వ్యవధి 22 నుంచి 24 నెలల వరకు ఉంటుంది. అయితే ఒక కాన్పులో ఒకే బిడ్డకు ఏనుగులు జన్మనిస్తాయి. కానీ ఈ ఏనుగు కవలలకు జన్మనిచ్చింది. అంటే పర్యావరణ సమతుల్యతకు ఈ ఘటనే నిదర్శనమని వన్యప్రాణి సంరక్షకుడు సత్‌ప్రీత్ సింగ్ శెట్టి పేర్కొన్నారు. అయితే రెండేండ్ల కాలం పాటు ఇద్దరు పిల్లలను తన కడుపులో పెట్టుకుని ఉండడం అనేది చాలెంజింగ్ విషయమని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి :
అమెరికాలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతి
జయం రవి విడాకుల ట్విస్ట్.. భరణం లెక్కలు వింటే మతిపోవాల్సిందే.. ఒక్కో నెల ఇన్ని లక్షలా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram