తమిళ సినీ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి మధ్య వైవాహిక వివాదం ఇప్పుడు మళ్లీ తమిళనాట సెన్సేషన్‌గా మారింది. ఈ జంట, 2024 చివరిలో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి యావత్ సినీ పరిశ్రమను షాక్‌కు గురిచేశారు. ఇక రీసెంట్‌గా జరిగిన ఒక ప్రెస్‌మీట్‌లో జయం రవి కన్నీళ్లు పెట్టుకున్నాడు. తనను వేధిస్తున్నారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో‌ వీరిద్దరు విడాకులకు సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. జయం రవి భార్య ఆర్తి నెలకు రూ. 40 లక్షల భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. ఈ ఆర్థిక డిమాండ్ వీరిద్దరి మధ్య న్యాయపోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది.

జయం రవి అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించి మీడియా ముందు తన ఆవేదనను వ్యక్తం చేసుకున్నాడు తన భార్య డిమాండ్ చేస్తున్న భారీ మొత్తంలో డబ్బు.. అదే విధంగా తనపై రోజూ వస్తున్న తప్పుడు ఆరోపణలను గుర్తుచేసుకుని జయం రవి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు. 

తనకు, తన పిల్లలకు విలాసవంతమైన జీవితం అందించడానికి నెలకు రూ. 40 లక్షల భరణం అవసరమని వాదిస్తూ.. రవి భార్య ఆర్తి చెన్నైలోని 3వ అదనపు ఫ్యామిలీ సంక్షేమ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ మొత్తం ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది.

నటుడు జయం రవి.. కోర్టులో తన భార్య ఇంత మొత్తాన్ని డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. వారిద్దరి మధ్య ఇకపై రాజీకి ఆస్కారం లేదని స్పష్టం చేసిన ఆయన.. వీలైనంత త్వరగా చట్టబద్ధంగా విడాకులను ఖరారు చేయాలని న్యాయమూర్తిని కోరారు.

జయం రవి, ఆర్తిల విడాకులు కేవలం డబ్బుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇందులో ఇంకా ఎన్నో చేదు నిజాలు వెలుగులోకి. జయం రవి ఆర్థిక వ్యవహారాలపై ఆర్తి కుటుంబానికి పూర్తి నియంత్రణ ఉందని, అతడిని స్వతంత్రంగా జీవించనివ్వలేదని జయం రవి సన్నిహిత వర్గాలు తీవ్రమైన ఆరోపణలు చేశాయి.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జయం రవి తన తీవ్రమైన మానసిక వేదనను వ్యక్తం చేశారు. 'నా కష్టకాలం నుంచి ఇప్పటి వరకు నేను సినిమా, కుటుంబం కోసమే బ్రతికాను. కానీ ఈ రోజు నన్ను విలన్‌గా చిత్రీకరిస్తున్నారు.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇక జయం రవికి ఒక్కో సినిమాకు రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. అంటే ఒక వేళం నెల చొప్పున భరణం ఇవ్వాల్సి వస్తే దాదాపుగా రూ.5 కోట్లు ఆమెకే ఇవ్వాల్సి ఉంటుంది.  

ఇక జయం రవి భార్య కోరుతున్న నెలకు రూ. 40 లక్షల భరణం డిమాండ్‌కు కోర్టు అంగీకరిస్తుందో.. లేదంటే జయం రవికి న్యాయం జరుగుతుందో అనేది రాబోయే రోజుల్లో చూడాల్సి ఉంది.