ప్రస్తుతం విజయ్, త్రిషల పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నేడు అసెంబ్లీకి హాజరయ్యాడు. ఆదివారం జరిగిన సీఎం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా కనిపించారు.
త్రిష చేతికున్న టాటూ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత కూడా తన వేలును చూపిస్తూ ఈ టాటూను హైలైట్ అయ్యేలా చూపించింది. ఈ టాటూ వల్లే విజయ్‌కు అదృష్టం కలిసివచ్చిందని కొందరు అంటుండగా, మరికొందరు ఈ టాటూ ప్రత్యేకత ఏంటనీ చర్చించుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఆమె చేతిపై ఉన్న ఒక చిన్న టాటూ కూడా తెగ వైరల్ అయింది. అయితే, ఈ టాటూకి విజయ్‌కి ఏమైనా సంబంధం ఉందా? ఇది విజయ్‌కి అదృష్టాన్ని తెస్తుందా? అని కొందరు తెగ సెర్చ్ చేస్తున్నారు. నిజానికి, ఈ టాటూ కారణంగానే విజయ్ అదృష్టం మారిందని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..కర్కాటకం, వృషభం అనేవి రెండు చాలా అనుకూలమైన రాశులు. వాటి మధ్య మంచి భావోద్వేగ బంధం ఉంటుంది. అందువల్ల, ఈ రెండు రాశుల కలయిక పెద్ద మార్పులకు దారితీస్తుంది. అంతేకాదు అదృష్టం కూడా కలిసి వస్తుంది.