ఒకప్పుడు రాజులు, రాణులు మాత్రమే ధరించగలిగే అరుదైన వజ్రాలు ఇప్పుడు కొందరు భారతీయ ప్రముఖుల వద్ద కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మెగా కృష్ణారెడ్డి భార్య సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ విలువ సుమారు 140 కోట్ల రూపాయలు అని నేషనల్ మీడియా కథనాల్లో ప్రచురించారు. ఈ అరుదైన డైమండ్ అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫ్యాషన్ ఈవెంట్ Met Galaలో సుధా రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2026 మే 5న జరిగిన ఈ వేడుకలో ఆమె “ట్రీ ఆఫ్ లైఫ్” అనే థీమ్‌తో ర్యాంప్‌పై నడిచి అందరినీ ఆకట్టుకున్నారు.

ఈ ఈవెంట్‌లో ఆమె ధరించిన డైమండ్ నెక్లెస్ ప్రత్యేకంగా నిలిచింది. దాని విలువ సుమారు 15 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు 140 కోట్లు. ఈ నెక్లెస్ విక్టోరియన్ శైలిలో రూపొందించబడింది. త్రిభుజాకార, పియర్ షేప్ రోజ్ కట్ వజ్రాలతో అందంగా డిజైన్ చేశారు.

దీని ప్రధాన ఆకర్షణగా టాంజానియాలోని మెరెలాని కొండల నుంచి వచ్చిన 550 క్యారెట్ల అరుదైన టాంజనైట్ రత్నాన్ని అమర్చారు. ఊదా-నీలం రంగులో మెరిసే ఈ రత్నం నెక్లెస్‌కు ప్రత్యేకమైన లుక్ ఇచ్చింది. దీనికి జతగా రాజస్థాన్‌కు చెందిన పోల్కీ డైమండ్ రింగ్‌ను కూడా ధరించి ఆమె మరింత అందంగా కనిపించారు.

ఈ లుక్‌ స్పెషల్‌గా ఉండటానికి ప్రముఖ డిజైనర్ Manish Malhotra రూపొందించిన రాయల్ బ్లూ గౌన్‌ను సుధా రెడ్డి ధరించారు. జర్దోజీ వర్క్, మెటాలిక్ డిజైన్స్‌తో కూడిన ఈ గౌన్ ఆమెకు మరింత రాజసం ఉట్టిపడేలా చేసింది. పొడవైన ట్రెయిల్‌తో కూడిన ఈ డ్రెస్సు మెట్ గాలా థీమ్‌కు సరిపోయేలా డిజైన్ చేశారు.

ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం తన లక్ష్యమని తెలిపారు. భారత హస్తకళలు కేవలం వారసత్వం మాత్రమే కాకుండా, సజీవ కళారూపమని ఆమె పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడం తన లక్ష్యమని తెలిపారు. భారత హస్తకళలు కేవలం వారసత్వం మాత్రమే కాకుండా, సజీవ కళారూపమని ఆమె పేర్కొన్నారు.