Peddi | ‘పెద్ది’లో చరణ్ కాదు.. ఆ పాత్రే కనిపిస్తుంది .. బుచ్చిబాబు కామెంట్స్‌తో హైప్ పీక్స్‌కు
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ భారీ స్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది.
Peddi | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం పెద్దిపై అంచనాలు రోజురోజుకీ భారీ స్థాయికి చేరుకుంటున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సన రూపొందిస్తున్న ఈ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ డ్రామా ఇప్పటికే పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై తాజాగా బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ముఖ్యంగా రామ్ చరణ్ పాత్ర గురించి దర్శకుడు చెప్పిన మాటలు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. “సినిమా మొదటి 20 నిమిషాల తర్వాత ప్రేక్షకులకు రామ్ చరణ్ కనిపించడు… కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు” అంటూ బుచ్చిబాబు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఒక్క మాటతోనే సినిమాలో చరణ్ పాత్రను ఎంత బలంగా, భావోద్వేగాలతో డిజైన్ చేశారో అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
చివరి 20 నిమిషాలు..
ఇక సినిమా రన్‌టైమ్ గురించి కూడా దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మొత్తం 3 గంటల 2 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే చివరి 20 నిమిషాల్లో రామ్ చరణ్ నటన సినిమాకే హైలైట్ అవుతుందని, ఆ ఎమోషనల్ పీక్ ప్రేక్షకులను గట్టిగా కదిలిస్తుందని బుచ్చిబాబు చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
అంతేకాదు, ఈ సినిమాకు సంబంధించిన క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే దక్కాలని దర్శకుడు చెప్పడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. సాధారణంగా దర్శకులు హీరోలపై ప్రశంసలు కురిపించడం కామన్ అయినప్పటికీ, సినిమా మొత్తం బరువును హీరో భుజాలపై అంత నమ్మకంగా ఉంచడం అరుదైన విషయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త అవతారంలో..
ఇప్పటికే షూటింగ్ సమయంలో పలువురు టెక్నీషియన్స్, యూనిట్ సభ్యులు కూడా చరణ్ నటనపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రగ్డ్ లుక్, మాస్ బాడీ లాంగ్వేజ్‌తో చరణ్ పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడని సమాచారం. ముఖ్యంగా ఆయన డైలాగ్ డెలివరీ, ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలం అవుతాయని టాక్ వినిపిస్తోంది.
ఇక ఈ సినిమాపై హైప్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది దర్శకుడు సుకుమార్ చేసిన వ్యాఖ్యలు. ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ, “రంగస్థలం తర్వాత రామ్ చరణ్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ‘పెద్ది’లో చూస్తారు” అని ఆయన చెప్పడం అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. రంగస్థలం ఇప్పటికీ చరణ్ కెరీర్‌లో మైలురాయి చిత్రంగా భావించే ప్రేక్షకులకు, సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఇప్పటికే యూఎస్ మార్కెట్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన వస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 2026లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించే సినిమాల్లో ‘పెద్ది’ ఒకటిగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. రిలీజ్ దగ్గరపడుతున్న కొద్దీ ఈ సినిమా హంగామా మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram