రూ.2లే అని చెప్పి బిగ్ బాస్ బ్యూటీ బ్యాంక్ అకౌంట్‌లో రెండు ల‌క్ష‌లు మాయం చేసిన సైబ‌ర్ కేటుగాళ్లు

బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భ‌ట్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్కర్లేదు. ఈ అమ్మ‌డు నాగార్జున హోస్ట్ చేసిన షోలో పాల్గొని త‌న ఆట‌తో అంద‌రి మ‌న‌స్సుల‌ని కొల్ల‌గొట్టింది. ఆమె చెప్పిన ప‌లు విష‌యాల‌కి సింప‌తీ కూడా ఏర్ప‌డింది. అయితే ఇటీవ‌ల కీర్తి భ‌ట్ కుమారి ఆంటీ హోటల్ లో ఫుడ్ అస్సలు బాలేదని కామెంట్ చేయగా ఆమెను చాలామంది ట్రోల్ చేయడం జరిగింది. కీర్తి భట్, విజయ్ కార్తీక్ ఈ ట్రోల్స్ ఎక్కువ కావడంతో మేము ఫుడ్ టేస్ట్ చేసి ఉన్నది ఉన్నట్లు చెప్పామని అలా చెప్పడం కూడా త‌ప్పా అని కామెంట్ చేశారు. అయితే బిగ్ బాస్ షో నుండి బ‌య‌ట‌కు వ‌చ్చాక కీర్తి భ‌ట్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలో తాను తన అకౌంట్ నుండి రెండు ల‌క్ష‌లు క‌ట్ అయ్యాయ‌ని చెప్పుకొచ్చింది.

  • Publish Date - March 30, 2024 / 04:15 AM IST

నాకు ఒక కొరియ‌ర్ రావ‌ల్సి ఉండ‌గా, అది ఎంత‌కు రాక‌పోయే స‌రికి మెయిన్ కొరియర్ సెంటర్ వాళ్లకి కాల్ చేశాను. అప్పుడు వారు మా ద‌గ్గ‌ర నుండి డెలివ‌రీ అయింది. మెహిదీప‌ట్నంలో ప్ర‌స్తుతం ఉంద‌ని చెప్పారు. అది చాలా ఇంపార్టెంట్ కావ‌డంతో ఒక‌సారి ట్రాక్ చేసి కూడా చూడ‌గా, మెహిదీప‌ట్నంలో ఉంద‌ని క‌నిపించింది. ఆ త‌ర్వాత నాకు ఒక కాల్ రాగా, వాళ్లు హిందీలో మాట్లాడారు. మీకు కొరియ‌ర్ రావాలి క‌దా, ఇంకా రీచ్ కాలేదా అని వాళ్లు అడిగారు. అప్పుడు నేను నాకు రాలేదు అని చెప్పాను. అయితే అప్పుడు వారు మీ లొకేషన్ అడ్రస్ అప్డేట్ కాలేదు.. కాబట్టి వాట్సాప్‌లో మీ ఫుల్ అడ్రస్ పంపించండి అని నెంబర్ పెట్టారు. నేను కాల్‌లో ఉండే పెట్టాను. అయితే తర్వాత వారు అడ్రెస్ అప్‌డేట్ కావ‌డం లేదు. మీకు నార్మల్ నెంబర్ నుంచి హాయ్ అనిపంపిస్తా.. దానికి రిప్లై ఇవ్వమని అన్నారు. నేను వాళ్లు చెప్పినట్టే హాయ్ అని మెసేజ్ పెట్టారు.

ఆ త‌ర్వాత నా రిజిస్ట‌ర్ మొబైల్ నెంబ‌ర్ నుండి నాకు ఒక లింక్ వ‌చ్చింది. దానిని కాపీ చేసి వారు పంపిన నెంబ‌ర్‌కి ఫార్వ‌ర్డ్ చేయ‌మ‌న్నారు. వాళ్లు చెప్పిన‌ట్టే వాట్సాప్ నెంబర్‌కి అదే లింక్‌ని ఫార్వర్డ్ చేసా. ఆత‌ర్వాత ఆ లింక్‌ని ఓపెన్ చేయమన్నారు. అడ్రస్ అప్డేట్‌కి రూ.2 రూపాయిలు ఎక్స్ ట్రా పే చేయాల్సి వస్తుంది మేడమ్ అని అన‌గా, రెండు రూపాయ‌లే క‌దా, ఓకే అన్నాను. అయితే ఆ త‌ర్వాత యూపీఐ మెన్షన్ చేయమని అన్నారు. నాకు డౌట్ వచ్చి.. చేయనని చెప్పాను. అప్పుడు బ్యాంక్‌కి లింక్ అయిన రిజిస్టర్ నెంబర్ ఇదే క‌దా అని అడ‌గ‌గా, అవున‌ని అన్నాను. అప్పుడు నాకు ప్రాసెసింగ్ అని మెసేజ్ వచ్చింది. మేడమ్ మీకు కాసేపు ఆగి కాల్ చేస్తాం.. అప్డేట్ ఇస్తాం అని చెప్పారు. ఇక అర్ధ‌రాత్రి స‌మ‌యంలో సరిగ్గా.. 12 గంటలకు రూ.99వేలు కట్ అయ్యింది.. ఆ వెంటనే మళ్లీ మరో రూ.99 వేలు కట్ అయ్యింది. నేను వెంటనే బ్యాలెన్స్ చెక్ చేస్తే రెండు లక్షలు కట్ అయినట్టు చూపిస్తుంది. వెంటనే సైబర్‌లో కంప్లైంట్ ఇచ్చాం. నా అకౌంట్‌ని బ్లాక్ చేయించాను. అయితే నా డ‌బ్బులు క‌ట్ అయింది ఆదివారం రోజు కాబ‌ట్టి, వారు అమౌంట్ ట్రాన్స‌ఫ‌ర్ చేసుకోవ‌డానికి టైం ప‌ట్టింది. అయితే వెంటనే కంప్లైంట్ ఇచ్చాం కాబట్టి.. సైబ‌ర్ క్రైమ్ వారు అమౌంట్‌ ట్రాన్స్ఫర్ కాకుండా వాళ్ల అకౌంట్‌లను బ్లాక్ చేయిస్తున్నాం అని, త‌ప్ప‌కుండా అవి తిరిగి వెన‌క్కి వ‌స్తాయ‌ని చెప్పారు.

Latest News