Site icon vidhaatha

Keerthy Suresh|నేను సింగిల్ కాదు అంటూ కీర్తి సురేష్ పెద్ద బాంబే పేల్చిందిగా.. త్వ‌ర‌లో పెళ్లి పీట‌లు ఎక్కుతుందా?

Keerthy Suresh| టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒక‌రు.చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఒక‌ప్పటి స్టార్ హీరోయిన్ మేనక కూతురిగా సినిమా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆన‌తికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. మొద‌ట నేను లోక‌ల్ అనే చిత్రంలో కీర్తి సురేష్ న‌టించ‌గా, ఆ చిత్రం సూప‌ర్ హిట్ అందుకుంది. ఇక ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రంలో న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంది. ఆ సినిమా ఫ్లాప్ కావ‌డంతో కీర్తి సురేష్‌కి అవ‌కాశాలు రావు అనుకున్నారు. కాని మ‌హాన‌టి చిత్రంలో సావిత్రిగా న‌టించి ఒక్క‌సారిగా త‌న క్రేజ్ దేశ వ్యాప్తంగా పాకేలా చేసుకుంది. ఈ సినిమాతో జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకుంది.

కీర్తి సురేష్ ఇప్పుడు స్టార్ హీరోల ప‌క్క‌న క‌థానాయిక‌గా న‌టించ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు లేడి ఓరియెంటెడ్ చిత్రాల‌లో కూడా న‌టిస్తూ అల‌రిస్తూ ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య కీర్తి సురేష్ ప్రేమ‌, పెళ్లికి సంబంధించి ఎక్కువ‌గా రూమ‌ర్స్ వ‌స్తున్నాయి. తాజాగా ఆ రూమ‌ర్స్‌పై కీర్తి సురేష్‌ స్పందించారు. కెరీర్ బిగినింగ్ లో నాకు వరుసగా పరాజయాలు ఎదురుకావ‌డంతో నన్ను బాగా ట్రోల్ చేశారు. ఆ ట్రోల్స్ బాధకు గురి చేశాయి. మహానటి విజయం తర్వాత ట్రోల్స్ తగ్గాయి కాని కొందరు కావాలనే నాపై పుకార్లు పుట్టించారు. నెగిటివిటీని నేను పట్టించుకోను. కాలమే వాటికి సమాధానం చెబుతుందంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.

అయితే ఓ రిపోర్ట‌ర్ మీరు సింగిల్ క‌దా, లైఫ్ బోర్ కొట్ట‌డం లేదా అని ప్ర‌శ్నించ‌గా దానికి కీర్తి సురేష్ నేను సింగిల్ అని ఎవ‌రు చెప్పారంటూ తిరిగి ప్ర‌శ్న వేసింది. దీంతో అంద‌రు షాక్ అయ్యారు. ఇక పెళ్లి అంటే ఏమిటో కూడా తెలియ‌జేసింది కీర్తి సురేష్‌. ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహనే వివాహం అని కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. అయితే కీర్తి సురేష్ తాను సింగిల్ కాదంటూ చెప్పుకురాగా మ‌రి త‌న మ‌న‌సులో ఉన్న ఆ ల‌క్కీ ఫెల్లో ఎవ‌రో అని జ‌నాలు తెగ ముచ్చ‌టించుకుంటున్నారు

Exit mobile version