Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవికి దేశ వ్యాప్తంగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వయంకృషితో ఇండస్ట్రీకి వచ్చిన చిరు మెగాస్టార్‌గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలని తన ఖాతాలో వేసుకున్న చిరు అశేష ప్రేక్షకాదరణ దక్కించుకున్నాడు. ఇప్పటికీ కూడా కుర్ర హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర’సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం చిరంజీవి చాలా కష్టపడుతున్నారు. గత సినిమాలు వరుసగా ప్లాప్ అవ్వడంతో ఈ సినిమాపై చిరు ప్రత్యేక దృష్టి పెట్టారు. అన్ని కూడా దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. చిరు సినిమా కూడా మంచి హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
కాగా, చిరంజీవికి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికి తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా చిరంజీవిని ఎంతో ఇష్టపడుతుంటారు. చిరంజీవిని ఇష్టపడే వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకరట. విరాట్ కోహ్లీ ఫ్రెండ్, తెలంగాణకు చెందిన క్రికెటర్ రవితేజ కోహ్లీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు తెలంగాణకు చెందిన ద్వారక రవితేజ గతంలో అండర్ 15 సమయంలో కోహ్లీతో కలిసి ఆడడం మనం చూశాం.ఇద్దరు ఒకే రూమ్‌లో కూడా ఉండేవారట. ఈ క్రమంలో కోహ్లీకి సంబంధించిన పలు విషయాల గురించి ఆయనకు అవగాహన ఉంది.
తాజాగా రవితేజ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను, కోహ్లీ కలిసి అండర్ 15 లో డొమెస్టిక్ క్రికెట్ ఆడాము అని చెప్పారు. ఇద్దరం ఒకే రూమ్‌లో ఉన్నప్పుడు ప్రతి రోజూ చిరంజీవి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసేవాళ్ళం. కోహ్లీకి చిరంజీవి సాంగ్స్ అంటే చాలా ఇష్టం. మేమిద్దరం ఒకరినొకరం చిరు అని సరదాగా పిలుచుకునేవాళ్లం అని ఆయన తెలియజేశారు. ఇక మేమిద్దరం ఆరేళ్ల గ్యాప్ తర్వాత కలిసాము. అప్పుడు కూడా చిరంజీవి ఎలా ఉన్నారని అడిగాడు అంటూ కోహ్లీ స్నేహితుడు తెలియజేశాడు. ఈ విషయం విన్న మెగా ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ కి ఎవరైనా అభిమాని అయిపోవాల్సిందే అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు