Kriti Sanon| ఈ మధ్య సెలబ్రిటీల ప్రేమ, పెళ్లి విషయాలకి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొందరు సీక్రెట్‌గా ప్రేమాయణం నడిపించి వారితో పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. మరి కొందరు మాత్రం ఇంకా సీక్రెట్‌గా ప్రేమలో మునిగి తేలుతున్నారు. వారి విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నారు. ఈ లిస్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఉంది. నాగ చైతన్యతో నటించిన దోచేయ్ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కృతి.. ఆ తర్వాత మహేశ్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమా చేసింది. ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇటీవలే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా మెప్పించింది.అయితే ఆ మూవీ అంత హిట్ కాకపోవడంతో తెలుగులో అవకాశాలు రావడం కష్టమే అంటున్నారు.
అయితే ఆదిపురుష్ చిత్ర ప్రమోషన్ సమయంలో ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ తెగ ప్రచారాలు సాగాయి. ఓ షోలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ కూడా ఈ రూమర్స్ కి మరింత ఆజ్యం పోసింది. అయితే కృతి సనన్ ఈ వార్తలను ఖండించింది. తాము కేవలం మిత్రులమే, మా మధ్య అలాంటివి ఏమి లేవని క్లారిటీ ఇచ్చింది. ఇక కృతి సనన్.. గతంలో దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ తో కూడా కృతి సనన్ ఎఫైర్ నడిపిందనే వాదన ఉంది. ఇక ప్రస్తుతం కబీర్ బహియా అనే వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్నట్టు ప్రచారం నడుస్తుంది. కబీర్-కృతి సనన్ తరచుగా కలుస్తున్న ఫోటోలు బయటకు వస్తుండడంతో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
కృతి సనన్ బర్త్ డే పార్టీకి కూడా కబీర్ హాజరయ్యాడని , ఇద్దరూ చేయి చేయి పట్టుకుని విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న ఫోటోలు బయటకు రావడంతో వారిద్దరు ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై కృతి ఇంత వరకు స్పందించలేదు. అయితే అసలు ఈ కబీర్ బహియా ఎవరు అనేది చూస్తే.. లండన్ కి చెందిన ఈ 24 ఏళ్ల కుర్రాడు సంపన్నుల కుటుంబంలో జన్మించాడు. తండ్రి కుల్విన్దర్ బహియా యూకేలో సౌథాల్ ట్రావెల్ పేరుతో ఒక ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. కబీర్ ఆస్తుల విలువ రూ. 45 వేల కోట్లకు పైమాటే ఉంటుందని తెలుస్తుంది. కృతి-కబీర్ మధ్య ఏజ్ గ్యాప్ 10 సంవత్సరాలు అని తెలుస్తుంది. కృతి సనన్‌కు 34 సంవత్సరాలు కాగా.. కబీర్ కు 24 ఏళ్లు మాత్రమే అట. కబీర్ కు ఇండియన్ క్రికెటర్స్ తో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. హార్థిక్ పాండ్యా-నటాషా వెడ్డింగ్ కి కబీర్ హాజరయ్యాడు. అలాగే మహీంద్రా సింగ్ ధోనీకి కూడా కబీర్ మిత్రుడు.