Krithi Shetty| తాను రిలేష‌న్‌లో ఉన్న‌ట్టు ఓపెన్‌గా చెప్పిన కృతి శెట్టి.. ఎవ‌రితోనో తెలుసా?

Krithi Shetty| ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందంతో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ కెరీర్ మొద‌ట్లో వ‌రుస హిట్స్ అందుకుంది. కాని ఆ త‌ర్వాత ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించ‌డంతో ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు సన్న‌

  • Publish Date - June 5, 2024 / 07:30 PM IST

Krithi Shetty| ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి చాలా ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి. చూడ చ‌క్క‌ని అందంతో కుర్ర‌కారు మ‌న‌సులు దోచుకుంటున్న ఈ అందాల ముద్దుగుమ్మ కెరీర్ మొద‌ట్లో వ‌రుస హిట్స్ అందుకుంది. కాని ఆ త‌ర్వాత ప‌రాజ‌యాలు ప‌ల‌క‌రించ‌డంతో ఇప్పుడు తెలుగులో అవ‌కాశాలు సన్న‌గిల్లాయి. ఎట్ట‌కేల‌కి ‘మనమే’ సినిమాలో ఛాన్స్ సంపాదించుకుంది. శర్వానంద్ లీడ్ రోల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో కృతి రోల్​ చాలా స్ట్రాంగ్​గా ఉండనున్నట్లు తెలుస్తోంది. జూన్ 7న మూవీ విడుదలవ్వనుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్​ మొత్తం ప్రమోషనల్ ఈవెంట్స్​లో బిజి బిజీగా గడుపుతోంది. ఇందులో కథానాయిక‌గా న‌టించిన‌ కృతి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొని తన గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటోంది.

మీరు రిలేషన్షిప్ లో ఉన్నారా? అని అడగ్గా… అవును అని సమాధానం చెప్పింది. ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారని అడగ్గా… నా ప్రొఫెషన్ తో అంటూ స్ట‌న్నింగ్ స‌మాధానం చెప్పింది. నా వర్క్ తో నేను రిలేషన్షిప్ లో ఉన్నానంటూ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది కృతి. ఇప్పుడు ఈ అమ్మ‌డు చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కృతి శెట్టి ఎంగేజ్మెంట్ అయిపోయింది అన్న వార్త ఇటీవ‌ల క‌న్న‌డ‌ ఇండస్ట్రీని షేక్ చేసింది . ఆమెకు చిన్నతనంలోనే తన బావతో ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారని,అందుకే చిన్న ఒక ఫంక్షన్ కూడా చేసి కృతి శెట్టి అతడికి ఎంగేజ్మెంట్ కూడా చేసారని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై కృతి శెట్టి ఏమి స్పందించ‌లేదు.ఇక తాజా ఇంట‌ర్వ్యూలో తన ఫేవరట్ హీరో గురించి ఓపెన్ అయ్యారు. తనకు రామ్​ చరణ్ అంటే ఎంతో ఇష్టమని ​చెప్పుకొచ్చింది. “గతంలో నేను కొన్ని తెలుగు సినిమాలు చూశాను. అయితే ‘రంగస్థలం’ సినిమా నాకు ఎంతో క‌నెక్ట్ అయింది. అందులో రామ్ చరణ్​ యాక్టింగ్ నాకు బాగా న‌చ్చ‌డంతో అప్పట్నుంచి ఆయనకు నేను పెద్ద ఫ్యానైపోయాను. అంతే కాకుండా ఆయన గురించి నేను చాలా విన్నాను. పని చేస్తున్న సమయంలో ఎంతో డెడికేటెడ్​గా ఉంటారు అని, అందరితో చాలా బాగా ఉంటారని, అందరికి మర్యాద ఇస్తారని విన్నాను. రామ్ చరణ్​తో నటించే అవకాశం వస్తే నేను చాలా ఎగ్జైటడ్​గా ఫీల్ అవుతాను. ఆ మూవీ కోసం ఇంకా ఎక్కువ హార్డ్​వర్క్ చేస్తాను అంటూ కృతి తన మనసులో మాట బయటపెట్టింది.

Latest News