Lavanya Tripathi| పెళ్లైన లావ‌ణ్య త్రిపాఠికి మ్యారేజ్ ప్ర‌పోజ‌ల్.. ఆమె స‌మాధానం విని అందరు షాక్

Lavanya Tripathi| అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి.ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప‌రంగా అంత మంచి స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. అయితే మెగా హీరోని మెల్ల‌గా ప్రేమ‌లోకి దింపి ఇటీవ‌ల పెళ్లి కూడా చేసుకుంది. దాదాపు 5 ఏళ్ళ సీక్రేట్ లవ్ తరువాత.. ఈ జంట ఘ‌నంగా పెళ్ళి చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. మెగా కోడలిగా అడుగు పెట్టిన తరువాత లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ

  • Publish Date - June 14, 2024 / 10:33 AM IST

Lavanya Tripathi| అందాల రాక్ష‌సి సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ లావ‌ణ్య త్రిపాఠి.ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప‌రంగా అంత మంచి స‌క్సెస్ అందుకోలేక‌పోయింది. అయితే మెగా హీరోని మెల్ల‌గా ప్రేమ‌లోకి దింపి ఇటీవ‌ల పెళ్లి కూడా చేసుకుంది. దాదాపు 5 ఏళ్ళ సీక్రేట్ లవ్ తరువాత.. ఈ జంట ఘ‌నంగా పెళ్ళి చేసుకున్నారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. మెగా కోడలిగా అడుగు పెట్టిన తరువాత లావణ్య త్రిపాఠి.. ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటుంది . రీసెంట్ గా మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఈ భామ ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమిత‌మైంది. పెద్ద‌గా సినిమాలు చేస్తున్న‌ట్టు లేదు. ఇక ఇటీవ‌ల లావణ్య త్రిపాఠి. ఎక్కడికెళ్ళినా సరే మెగా కోడలుగా స్పెషల్ స్టేటస్ అందుకుంటుంది .

అయితే లావణ్య త్రిపాఠికి చిన్న ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఆమె కాలికి గాయం కాగా, ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఫొటో షేర్ చేసింది. ఈ కార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి కూడా హాజ‌రు కాలేదు. అయితే నెల క్రితం మెట్లు ఎక్కుతుండ‌గా, చీల‌మండకి గాయం అయింద‌ని, అది చిన్నదే అయిన విశ్రాంతి తీసుకోవ‌ల్సి వ‌చ్చింద‌ని పేర్కొంది. నొప్పి త‌గ‌క‌పోవ‌డంతో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ కూడా చేయించిన‌ట్టు లావ‌ణ్య పేర్కొంది. ఇక గాయం వ‌ల‌న ఇంటికే ప‌రిమిత‌మై ఈ భామ ఫ్యాన్స్ తో ఆన్లైన్ చాట్ చేసింది. అభిమానులు అడిగే పలు ప్రశ్నలకి ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పింది.. ఈ క్రమంలో ఆమెకు ఒక అభిమాని పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. లావణ్య గారు మీరంటే చాలా ఇష్టం. ఈ జన్మలో వేరొకరిని పెళ్లి చేసుకున్నారు. కనీసం వచ్చే జన్మలో అయినా మనం పెళ్లి చేసుకుందాం… అని కామెంట్ పెట్టాడు.

ఈ కామెంట్ పై స్పందించిన లావణ్య త్రిపాఠి… హిందూ శాస్త్రం ప్రకారం పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని అంటారు. అలాగే ఈ జన్మకే కాదు జన్మజన్మలకి కూడా నా భర్త వరుణ్ తేజ్ మాత్రమే… అని సమాధానం ఇచ్చింది. లావణ్య స్పందించిన తీరుకు నెటిజెన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. భ‌ర్త అంటే లావ‌ణ్య త్రిపాఠికి ఎంత ప్రేమ ఉందో అని మెగా ఫ్యాన్స్ అయితే తెగ మురిసిపోతున్నారు. ఈ మ‌ధ్య తన భ‌ర్త‌తో క‌లిసి లావ‌ణ్య త్రిపాఠి వెకేష‌న్‌కి వెళ్లిన విష‌యం తెలిసిందే.

Latest News