Viral Video : వైరల్ అవుతున్న చిన్నారుల డ్యాన్స్

'భోలో జై గణేషా' పాటకు ఇద్దరు చిన్నారులు చేసిన అదిరిపోయే డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. శిక్షణ పొందిన వారి మాదిరిగా సాహసోపేతమైన స్టెప్పులు వేసిన వారిని నెటిజన్లు 'చిచ్చర పిడుగులు' అంటూ ప్రశంసిస్తున్నారు.

విధాత : టాలెంట్ ఏ ఒక్కడి సొంతం కాదు..అంటూ ఓ ఇద్దరు సాధారణ చిన్నారులు తమ అద్బుత డ్యాన్స్ తో లోకానికి చాటారు. మెరికలు తిరిగిన డ్యాన్సర్ల మాదిరిగా ‘భోలో జై గణేషా’ పాటకు ఇద్దరు చిన్నారులు అదిరిపోయే డ్యాన్స్ చేశారు. ఆ పిల్లల డ్యాన్స్ చూసిన నెటిజన్లు వామ్మె వారు పిల్లలు..కాదు చిచ్చర పిడుగులు అంటూ కితాబునిస్తున్నారు. డ్యాన్స్ స్టెప్పులలో ఏదో శిక్షణ పొందిన వారి మాదిరిగా ఆ ఇద్దరు చిన్నారులు చేసిన డ్యాన్స్ జాతీయ, రాష్ట్ర స్ధాయి డ్యాన్స్ షోలకు తీసిపోదంటున్నారు.

పాటలోని సంగీతం, సాహిత్యాలకు అనుగుణంగా ఆ చిన్నారులు చేసిన డ్యాన్స్ స్టెప్పులలో అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన స్టెప్పులు కూడా ఉండటం విశేషం. తమ నృత్యవిన్యాసాలతో ఆ చిన్నారులు చేసిన డ్యాన్స్ వీడియో ఇఫ్పుడు నెట్టింటా వైరల్ అవుతుంది. మట్టిలో మాణిక్యాల వంటి ఆ చిన్నారులను సాన పడితే భవిష్యత్ నటరాజులు అవుతారనడంలో సందేహం లేదంటు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.