Lavanya Tripathi | లావ‌ణ్య త్రిపాఠిని కూడా వేధిస్తున్నారా .. త‌ట్టుకోలేక సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిందా?

Lavanya Tripathi | సోషల్ మీడియా విస్తరించడంతో సెలబ్రిటీలపై ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. చిన్న విషయం దొరికినా కొందరు నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఈ సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నారు.

Lavanya Tripathi | సోషల్ మీడియా విస్తరించడంతో సెలబ్రిటీలపై ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లు కూడా భారీగా పెరుగుతున్నాయి. చిన్న విషయం దొరికినా కొందరు నెటిజన్లు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ఈ సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నారు. తాజాగా నటి లావ‌ణ్య త్రిపాఠి కూడా ఇలాంటి ఆన్‌లైన్ వేధింపులకు గురవుతూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం వ‌రుఫ్ తేజ్ సతీమణిగా, మెగా కుటుంబ కోడలిగా ఉన్న లావణ్య త్రిపాఠిపై కొంతకాలంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కొందరు వ్యక్తులు ఆమెను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెడుతున్నారని సమాచారం. దీంతో ఈ ట్రోలింగ్‌ను ఇక భరించలేనని భావించిన లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లావణ్య త్రిపాఠి ఫిర్యాదు ప్రకారం, కొందరు సోషల్ మీడియా యూజర్లు ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాదు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని కూడా ఆరోపించారు. తనపైన మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపారు.

ప్రత్యేకంగా “Purple Crayon 00” అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో పాటు కొన్ని యూట్యూబ్ ఐడీలు, ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్స్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఈ దుష్ప్రచారం జరుగుతోందని లావణ్య త్రిపాఠి పోలీసులకు వివరించారు. ఆ ఖాతాలకు సంబంధించిన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వేధింపులకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలు, థంబ్‌నెయిల్స్, సోషల్ మీడియా పోస్టులు వంటి ఆధారాలను కూడా ఆమె సైబర్ క్రైమ్ అధికారులకు అందజేశారు. దీంతో లావణ్య త్రిపాఠి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహితలోని సెక్షన్ 78, 79 కింద నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ, అసభ్యకరమైన కంటెంట్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

Latest News